మాస్ మహారాజా కొత్త బిజినెస్ ప్లాన్

By iDream Post Jun. 25, 2020, 05:35 pm IST
మాస్ మహారాజా కొత్త బిజినెస్ ప్లాన్

లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన క్రాక్ బాలన్స్ వర్క్ కోసం వెయిట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ త్వరలో కొత్త బిజినెస్ ప్లాన్ తో రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే అది కూడా సినిమాకు సంబంధించినదే లెండి. త్వరలో రవితేజ స్వంతంగా ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ చేయబోతున్నట్టుగా తెలిసింది. తనది ప్లస్ పిల్లల పేర్లు కలిసి వచ్చేలా రెండు మూడు ఆప్షన్స్ తో ఆల్రెడీ ప్లానింగ్ కూడా మొదలైపోయిందట. కాకపోతే దీని ద్వారా కొత్త టాలెంట్ ని తీసుకొచ్చే ఉద్దేశంతో రవితేజ పక్కా స్కెచ్ తో ఉన్నట్టు సమాచారం. మంచి కథలు లేదా స్క్రిప్ట్స్ ఉన్న రచయితలు దర్శకులు నేరుగా తనను కలిసేలా ఒక సిస్టంని డిజైన్ చేయిస్తున్నారట.

ఇందుకు గాను సహాయ సహకారాలు అందించేందుకు దర్శకుడు పూరి జగన్నాధ్ రంగంలోకి దిగినట్టు టాక్. ఈ ఇద్దరు కలిసి నిర్మాణ సంస్థకు కావాల్సిన వనరులు, దానికి ఫాలో కావాల్సిన పద్దతులు తదితరాల మీద చాలా సేపు చర్చలు జరిపారు. పరిస్థితి సద్దుమణిగాక దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. హీరోలకు స్వంతంగా ప్రొడక్షన్ హౌజులు ఉండటం కొత్తేమి కాదు. ఎన్టీఆర్, చిరంజీవిలతో మొదలుకుని పవన్ కళ్యాణ్, మహేష్ బాబు దాకా ప్రతిఒక్కరికి ఉన్నాయి. ఈ విషయంలో రవితేజ కొంచెం లేట్ గానే ఉన్నారు. అయినా కూడా కరెక్ట్ టైం అనే చెప్పొచ్చు. పేరున్న దర్శకులనే నమ్ముతున్నప్పటికి తనకు వస్తున్న అపజయాల పరంపరను బ్రేక్ చేయాలంటే ఫ్రెష్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం ఒకటే మార్గమని రవితేజ భావనట. అయితే తాను మాత్రమే నటించే సినిమాలే కాకుండా కథ డిమాండ్ ను బట్టి వేరే ఆర్టిస్టుల సినిమాలు కూడా ఈ బ్యానర్ లో రూపొందుతాయట.

ఇది మంచి నిర్ణయమే. సో అభిమానులు ఇకపై తమ హీరో పేరు మీద బ్యానర్ ని తెరమీద చూసుకోవచ్చు. క్రాక్ కోసం ఇంకో పది రోజులు పని చేస్తే షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. హైదరాబాద్ లో వైరస్ ఇంకా అదుపులోకి రాని కారణంగా ఇలాంటి పెద్ద సినిమాలేవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇది పూర్తి కాగానే త్రినాధరావు నక్కిన, రమేష్ వర్మ, వక్కంతం వంశీ సినిమాలను క్యులో పెట్టారు రవితేజ. ఇందులో ఏది ముందు మొదలవుతుందనే క్లారిటీ మాత్రం ఇంకా లేదు. రవితేజ కూడా పూర్తిగా ఇంటికే పరిమితమై అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం తప్ప ఇతర స్టార్ల తరహాలోనే బయటికి రావడం లేదు. డిజాస్టర్ల ప్రవాహంలో ఉన్న మాస్ రాజాకు బ్లాక్ బస్టర్ అవసరాన్ని క్రాక్ తీరుస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp