కమల్ హాసన్ టైటిల్ తో రవితేజ ?

By iDream Post Aug. 10, 2020, 07:29 pm IST
కమల్ హాసన్ టైటిల్ తో రవితేజ ?

లాక్ డౌన్ ముగిశాక కొద్దిపార్ట్ మాత్రమే బాలన్స్ ఉన్న క్రాక్ పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజ దీని తర్వాత వరసగా ప్రాజెక్టులు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అన్నిటికన్నా ముందు రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందే ప్రాజెక్ట్ ముందు వరసలో ఉందని సమాచారం. దీనికి 'కిలాడీ' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇదే పేరుతో గతంలో కమల్ హాసన్ హీరోగా ఎన్నో సంవత్సరాల క్రితం ఓ డబ్బింగ్ సినిమా వచ్చింది. బాగానే ఆడింది. ఆ తర్వాత చాలా ఏళ్ళకు విశాల్ డబ్బింగ్ మూవీకి పెట్టారు కానీ అది విడుదల అయ్యిందో లేదో కూడా ఎవరికి తెలియనంతగా మాయమైపోయింది.

ఇప్పుడు దీని మీద రవితేజ కన్నేసినట్టుగా వినికిడి. హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. హీరొయిన్లుగా రాశి ఖన్నా, నిధి అగర్వాల్ ను సెలెక్ట్ చేశారట. అధికారిక ప్రకటన రోజు అన్ని వివరాలు ప్రకటిస్తారు. ఆ మధ్య ఫాంలో లేకుండా పోయిన రమేష్ వర్మకు రాక్షసుడు బాగా కలిసి వచ్చింది. మళ్ళీ ట్రాక్ లో పడ్డారు. రీమేకే అయినప్పటికీ దాన్ని హ్యాండిల్ చేసిన తీరు మెప్పు పొందింది. ఇప్పుడు రవితేజ సినిమాను ఏ జానర్ లో తీయబోతున్నారో ఇంకా తెలియలేదు. ఇది కాకుండా త్రినాధరావు నక్కినకు కమిట్ అయ్యారు రవితేజ. పాత రెట్రో స్టైల్ లో చిరంజీవి చంటబ్బాయి షేడ్స్ లో కొత్తగా ఉండేలా ప్లాన్ చేశారట.

ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది, నా పేరు సూర్యతో డెబ్యు షాక్ తిన్న స్టార్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్లో నటించేందుకు కూడా రవితేజ ఓకే చెప్పినట్టు టాక్ వచ్చింది కానీ లాక్ డౌన్ వల్ల అప్డేట్స్ రావడంలో టైం పడుతోంది. వరస డిజాస్టర్లతో డీలా పడిన మాస్ మహారాజా అభిమానులకు క్రాక్ బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. టీజర్ ఇప్పటికే ఆసక్తి రేపింది. సెప్టెంబర్ లో పరిస్థితి సద్దుమణిగితే అక్టోబర్ లో షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న క్రాక్ లో శృతి హాసన్ హీరొయిన్ కాగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఆడియో సింగల్స్ విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp