సలార్ గురించి స్లిప్ అయిన రవి

By iDream Post Feb. 12, 2021, 10:49 am IST
సలార్ గురించి స్లిప్ అయిన రవి

కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబోలో శరవేగంగా రూపొందుతున్న సలార్ ఈ ఏడాదే విడుదల కాబోతోంది. రాధే శ్యామ్ రిలీజ్ ని బట్టి దీన్ని సంవత్సరం చివరిలోగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సలార్ లో డార్లింగ్ ని ఊర మాస్ స్టైలిష్ అవతారంలో చూడబోతున్నారని ఇప్పటికే లీకైన పిక్స్ ని బట్టి తెలుస్తోంది. బాహుబలి నుంచి ప్రతి సినిమాకు కనీసం రెండు మూడేళ్లు తీసుకుంటున్న ప్రభాస్ కి గత కొన్నేళ్లలో అత్యంత వేగంగా పూర్తయిన చిత్రంగా కూడా సలార్ నిలవబోతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ కు కూడా కెజిఎఫ్ తర్వాత ఇంత ఫాస్ట్ గా తీయడం దీనితోనే అనుభవమవుతోంది.

ఇప్పటిదాకా సలార్ స్టోరీకి సంబంధించి ఎలాంటి క్లూస్ బయటికి రాలేదు. ఆ మధ్య ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం రీమేక్ గా చెప్పారు కానీ యూనిట్ దాని గురించి ఏ స్టేట్ మెంట్ ఇవ్వలేదు. తాజాగా సంగీత దర్శకుడు రవి బస్నూర్ ఓ ప్రెస్ మీట్ లో సలార్ దీని రీమేకే అని చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన యథాలాపంగా ఇది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పినప్పటికీ నిజానికి సాధారణ ప్రేక్షకులకు దీని గురించి అంత అవగాహన లేదు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరే చెప్పేయడంతో మొత్తానికి కథ గురించిన క్లారిటీ అయితే వచ్చేసింది. బ్యాక్ డ్రాప్ అర్థమైపోయింది.

ఉగ్రం 2014లో రిలీజయింది. హీరో శ్రీమురళిని అప్ కమింగ్ స్టేజి నుంచి స్టార్ గా మార్చింది. భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ చేయాలనుకుని ప్లాన్ చేశారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత ప్రశాంత్ కెజిఎఫ్ వైపు వెళ్ళిపోయాడు. ఉగ్రం చాలా పవర్ఫుల్ గా సాగే స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఎమోషన్స్ కూడా గట్టిగా ఉంటాయి. కొన్ని మార్పులు చేర్పులతో ప్రభాస్ కు పర్ఫెక్ట్ గా సూటవుతుంది. కాకపోతే గతంలో రెబెల్ తరహాలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. బాహుబలి, సాహో రేంజ్ లో బడ్జెట్ అయితే సలార్ కు కావడం లేదని ఇన్ సైడ్ టాక్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp