చైతుని ఇంప్రెస్ చేసిన దర్శకుడు

By iDream Post Sep. 20, 2020, 04:53 pm IST
చైతుని ఇంప్రెస్ చేసిన దర్శకుడు

ప్రస్తుతం లవ్ స్టోరీ ఫినిషింగ్ లో ఉన్న నాగ చైతన్య తనకు జంటగా నటిస్తున్న సాయి పల్లవితో కలిసి దర్శకుడు శేఖర్ కమ్ములకు ఫుల్ కోపరేషన్ అందించి త్వరగా పూర్తయ్యేలా హెల్ప్ చేస్తున్నాడు. విడుదల ఎప్పుడు ఎలా ఏ రూపంలో ఉంటుందన్నది ఇంకా బయటికి రాలేదు కానీ వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో గుమ్మడి కాయ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రేక్షకుల్లోనూ లవ్ స్టొరీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. దీని తర్వాత వెంటనే దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్ యులో జాయిన్ అవుతాడు చైతు. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మీద అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ చైతన్యని ఓ స్టోరీ లైన్ తో ఇంప్రెస్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. అతనెవరో కాదు వెంకీ అట్లూరి. ప్రస్తుతం నితిన్ రంగ్ దే చేస్తున్న ఇతగాడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చైతుకి చెప్పిన ఓ పాయింట్ హీరోకి బాగా నచ్చిందంట. దాంతో డెవలప్ చేశాక మాట్లాడుకుందామని అనుకున్నట్టు సమాచారం. వెంకీ గతంలో అఖిల్ తో మిస్టర్ మజ్ను రూపంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఇప్పుడు అన్నయ్యతో హిట్టు కొట్టే స్కెచ్ ఏదో వేసినట్టు కనిపిస్తోంది. లవ్ స్టోరీ అయ్యాక థాంక్ యు పూర్తి కావడానికి ఎలాగూ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే దాకా అవుతుంది. ఆలోగా వెంకీ స్క్రిప్ట్ ని రెడీ చేసుకోవచ్చు. క్రీడల బ్యాక్ డ్రాప్ లో గతంలో చైతు గతంలో మజిలీ రూపంలో పెద్ద హిట్టే కొట్టాడు. కాకపోతే అది లవ్ కమ్ ఎమోషనల్ డ్రామాగా ఎక్కువ సాగుతుంది.

కానీ వెంకీ చెప్పిన దాంట్లో మాత్రం స్పోర్ట్స్ మీద మంచి ఎపిసోడ్స్ ఉంటాయట. అది ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతానికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కాదు. ఇంకా పరిశీలన దశలోనే ఉంది. అంతా ఓకే అయితే రంగ్ దే నిర్మించిన సితారా సంస్థ ప్రొడక్షన్ కు సిద్ధంగా ఉంది. ఎలాగూ చైతుకి వీళ్ళతో ఓ కమిట్మెంట్ పెండింగ్ ఉందట. అది ఈ రకంగా తీర్చుకోవచ్చు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికాబోతున్నాయి. ఇక లవ్ స్టోరీ విషయానికి వస్తే థియేటర్లలోనే డిసెంబర్ లేదా వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నారట. ఓటిటి సంస్థలు ఎంత టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చినా కూడా చలించకుండా కట్టుబడి ఉండాలని అనుకున్నారట. అదీ మంచిదే. హాళ్లు తెరిచాక ఇండస్ట్రీ నుంచి ఓ అయిదారు సినిమాలైనా రెడీగా లేకపోతే తెరిచినా పెద్ద ఉపయోగం లేని పరిస్థితులు తలెత్తుతాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp