తేజ్ డాక్టర్ - శివగామి సిఎం

By iDream Post Mar. 20, 2020, 11:58 am IST
తేజ్ డాక్టర్ - శివగామి సిఎం

గత ఏడాది చిత్రలహరి, ప్రతి రోజు పండగే హిట్స్ తో చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటరూ మే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవలే దేవా కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని తాలూకు విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో తేజు మొదటిసారి డాక్టర్ గా నటించబోతున్నాడు. అంతే కాదు శివగామి రమ్యకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించబోతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మెడికల్ మాఫియాను నేపధ్యంగా తీసుకున్నట్టు తెలిసింది.

దేవా కట్టాకు ఇలాంటివి డీల్ చేయడంలో మంచి పనితనం ఉంది. ప్రస్థానం ద్వారానే అది ప్రూవ్ అయినప్పటికీ ఆ తరువాత వచ్చిని అవకాశాలను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. ఆ మధ్య సంజయ్ దత్ తో ప్రస్థానం హిందీ రీమేక్ చేస్తే అది దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు దీంతో హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. ఒకరకముగా తేజు చాలా రిస్క్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపించినప్పటికీ స్క్రిప్ట్ నచ్చడంతో ఇంకో ఆలోచన చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఇప్పటివరకు ఇలాంటి లైన్ టచ్ చేయలేదు కాబట్టి ఆ రకంగానూ కలిసి వస్తుందని భావిస్తున్నాడట. ఈ ఏడాదికే రిలీజ్ కు ప్లాన్ చేశారు కానీ కరోనా నేపథ్యంలో పరిశ్రమ మొత్తం అతలాకుతలం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ సోలో బ్రతుకే సో బెటరూ పోస్ట్ పోన్ అయితే ఇది కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రెండు హిట్లతో తేజు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. మెగా హీరోలు పొలిటికల్ జానర్ లో సినిమాలు చేసింది తక్కువే. ఒకరకంగా చెప్పాలంటే ముఠామేస్త్రినే ఆఖరిదని చెప్పొచ్చు. మరి దేవా కట్టా తేజుని ఎలా చూపించబోతున్నాడో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp