ఆ 2 సినిమాల విషయంలో బాధ లేదు

By iDream Post Jun. 08, 2020, 09:21 pm IST
ఆ 2 సినిమాల విషయంలో బాధ లేదు

ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ కున్న పేరు అందరికీ తెలిసిందే. 2006లో మొదటి సినిమా దేవదాస్ తోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అందరిని తనవైపు చూసేలా చేసుకున్న రామ్ మధ్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నాడు. గత కొంత కాలంగా హిట్టు లేక మార్కెట్ కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు పూరి జగన్నాధ్ తో చేయడం గురించి విని అందరూ షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ టైంకి పూరి కూడా ఫ్లాప్ ట్రాక్ లో ఉన్నాడు. కానీ కథను పూరిని నమ్మిన రామ్ మోసపోలేదు. ఇస్మార్ట్ శంకర్ దుమ్ము దులిపేసింది. ఏకంగా తన కెరీర్ బెస్ట్ గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది.

అయితే రామ్ కెరీర్లో చేసిన రెండు ప్రయోగాలు ఆశించినంత ఫలితం ఇవ్వలేకపోయాయి. అందులో మొదటిది జగడం. ఆర్య లాంటి స్మాషింగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ రెండో సినిమాకే తనను ఎంచుకోవడంతో పాటు సబ్జెక్టు విపరీతంగా నచ్చేసింది. అందుకే ఎక్కువ ఆలోచించకుండా తన లవర్ బాయ్ ఇమేజ్ ని సైతం పక్కన పెట్టేశాడు. రిజల్ట్ ఆశించినంత రాలేదు. కానీ రామ్ యాక్టింగ్ మాత్రం ఫెయిల్ కాలేదు. వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో సుకుమార్ తెరకెక్కించిన తీరుకి ఇప్పటికీ దాన్ని ఇష్టపడే అభిమానులు ఉన్నారు. ఇక రెండోది మసాలా. విక్టరీ వెంకటేష్ తో కాంబినేషన్. అందులోనూ హిందీలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న హిట్ మూవీకి రీమేక్. ఇంకేం రామ్ ఎక్కువ ఆలోచించలేదు. అందులోనూ రెగ్యులర్ హీరో తరహాలో కాకుండా ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ గా అనిపించడంతో ఒప్పేసుకున్నాడు.

కానీ రామ్ ని ఇలాంటి వేషంలో చూసేందుకు అభిమానులు ఇష్టపడలేదు. కట్ చేస్తే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మల్టీ స్టారర్ డిజాస్టర్ కాక తప్పలేదు. అయినా రామ్ కు అప్పటి నిర్ణయాల పట్ల ఎలాంటి బెంగ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటాయని చేసిన పాత్రలవి. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం వర్క్ అవుట్ కాలేదు. అయినప్పటికీ రామ్ కు అవి ఒప్పుకోకపోయి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ లేదు. నటుడిగా సవాళ్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ఓకే చేసినవి. సరే ప్రతిసారి అంచనాలు నిలవాలన్న గ్యారెంటీ ఏమి లేదు కాబట్టి అలా జరిగిపోయింది. ప్రస్తుతం రామ్ రెడ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. తమిళ్ హిట్ మూవీ తడంకు రీమేక్ గా రూపొందుతున్న రెడ్ కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా తిరుమల కిషోర్ దర్శకుడు. ఏప్రిల్ 9న విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ వల్ల వాయిదా పడిపోయి థియేటర్ల ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp