ఎన్టీఆర్ ను కొట్టి ఏడ్చిన చరణ్... ఎప్పటికి అర్థం చేసుకుంటారో పాపం

By iDream Post Sep. 09, 2021, 05:00 pm IST
ఎన్టీఆర్ ను కొట్టి ఏడ్చిన చరణ్... ఎప్పటికి అర్థం చేసుకుంటారో పాపం

టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ ఇప్పటిది కాదు, ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుంచి మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తూనే ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో కాస్త ఈ మల్టీస్టారర్ లో హడావిడి తగ్గింది అనుకోగానే మంచి మంచి మల్టీస్టారర్ మూవీస్ తెర మీదకు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే అది రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' అనే సినిమా. నిజానికి ఈ సినిమాకు ముందు వర్కింగ్ టైటిల్ కోసం ఈ పేరు అనుకున్నారు చివరికి ఈ పేరుతో టైటిల్ ఫిక్స్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదలా ఉంచితే మొదటి నుంచి కూడా మెగా- నందమూరి కుటుంబాల అభిమానుల మధ్య కాస్త పోటీ గట్టిగానే ఉండేది. ఎవరికి వారు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అనుకుంటూ అవతలి హీరోని నిందిస్తూ ఆ హీరో అభిమానులు సైతం టార్గెట్ చేసే పరిస్థితి ఉండేది.

Also Read: అంచనాలు పెంచేసిన గబ్బర్ సింగ్ కాంబో

అయితే ఇప్పుడు పరిస్థితులు తగ్గాయి అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఒకప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక హీరో అభిమానులు మరో హీరో మీద దండెత్తే పరిస్థితి. ఈ 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రారంభించిన కొత్తలో ఈ విషయాన్ని ఈ రాజమౌళి యూనిట్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మా హీరోకి కాకుండా మరో హీరోకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొన్నిచోట్ల వంకలు పెట్టిన పరిస్థితులు కనపడ్డాయి. అయితే ఇవన్నీ అభిమానుల మధ్యనే తాము మాత్రం ఎప్పుడూ చాలా స్నేహంగా కలిసి ఉంటామని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా చెబుతూనే ఉన్నారు. గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో వారు తమ స్నేహ బంధం గురించి చెప్పుకుంటూ వచ్చారు. మేము మేము బాగానే ఉన్నాము మీరు బాగుండండి అంటూ చెబుతున్నా ఫ్యాన్స్ వినిపించుకోని పరిస్థితులు. మొన్న అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీరు కోటీశ్వరులు అనే ఒక షో ప్రారంభించడంతో దానికి కర్టెన్ రైజర్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ స్వయంగా హాజరై మంచి పుషప్ ఇచ్చాడు.

Also Read: మోహన్ బాబుకు మెగాబ్రదర్ ప్రశ్నలు

అయితే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన షూటింగ్ లో జరిగిన ఒక విషయం బయటకు వచ్చింది. రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' కథ ప్రకారం సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కథ ప్రకారం అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ను దండించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలా ఒక సీన్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ తేజ కొరడాతో కొట్టాల్సి వస్తుంది, ఆ సీన్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ తేజ ఎత్తు నుండి కిందకి పడిపోవడంతో కాలు బెణకడంతో రెస్ట్ తీసుకుంటారని అనుకున్నా అది ఏమీ లేకుండానే ఆయన మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా సుజాత అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టిన తర్వాత రామ్ చరణ్ తేజ చాలా ఎమోషనల్ అవుతూ వెంటనే దెబ్బ తగిలిందా అంటూ వెళ్లి ఎన్టీఅర్ ను ఆలింగనం చేసుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చాడట.

సాధారణంగా సినిమాల్లో ఫైట్లు లేదా యాక్షన్ సీక్వెన్స్ లు చేసే సమయంలో గాయపడడం అనేది చాలా కామన్. కానీ మన వాళ్లు అనుకుంటే తప్ప చాలా ఎమోషనల్ గా ఇలా కంటి వెంట నీరు రావడం అనేది జరుగుతుంది. ఈ ఒక్క విషయంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య స్నేహబంధం ఎలా ఉందో అర్థమైపోతోంది.. ఈ విషయాన్ని అర్థం చేసుకుని అభిమానులు ఇకనైనా చిన్న చిన్న విషయాలకు గొడవపడుతూ తమ పరువు తీసుకుంటూ తమ అభిమాన హీరోల పరువు తీయకుండా ఉంటే మంచిది. ఎన్టీఆర్ ని కొట్టి తాను ఏడ్చేసి రామ్ చరణ్ తేజ అభిమానుల గుండెల్లో మరో మెట్టు ఎక్కేశాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే గతంలో ఇలాంటి సీన్లు గురించి బయటకు లీకయిన సందర్భాల్లో రాజమౌళి టీమ్ వెంటనే రంగంలోకి దిగి ఆయా యూట్యూబ్ ఇంటర్వ్యూలను డిలీట్ చేయించింది. ఇక ఈసారి ఏం చేస్తుందో చూడాలి మరి.

Also Read: పండగ బరిలో ఉండేదెవరు వెళ్ళేదెవరు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp