కలర్ఫుల్ గా సాగిన బిగ్ బాస్ 5 హంగామా

By iDream Post Sep. 19, 2021, 11:10 am IST
కలర్ఫుల్ గా సాగిన బిగ్ బాస్ 5 హంగామా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్ ఓటిటికి అఫీషియల్ బ్రాండ్ అంబాసడర్ గా ఫిక్సవ్వడం ఆలస్యం అప్పుడే ఓ రేంజ్ లో వాడకం మొదలుపెట్టారు. ఇప్పటికే దాని తాలూకు యాడ్ టీవీలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండగా నిన్న బిగ్ బాస్ 5 హౌస్ లోకి తీసుకొచ్చి ఈవెంట్ ని కలర్ ఫుల్ గా మార్చేశారు. దీనికి సంబంధించి ముందు నుంచే పబ్లిసిటీ చేయడంతో అభిమానులతో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కు సైతం దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఇటీవలే హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజైన మాస్ట్రో యూనిట్ నుంచి నితిన్, తమన్నా, నభ నటేష్ లు రావడంతో స్టార్ అట్రాక్షన్ మరింత పెరిగింది. జోష్ అయితే మాములుగా లేదు

రచ్చ టైటిల్ తో రామ్ చరణ్ ఎంట్రీ ఇప్పించిన బిగ్ బాస్ ఆ తర్వాత తనతో నాగార్జున కెమిస్ట్రీని పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. నాగ్ ఫిట్ నెస్ సీక్రెట్ అడగటం, చిరంజీవికి తనకు ట్రైనర్ ఒకరే అతను అర్జున్ అని ఓపెన్ చేసేయడం కొత్త ట్విస్టు. ఇద్దరూ పరస్పరం అన్నదమ్ములమని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆకట్టుకుంది. ఒక్కో పార్టిసిపెంట్ తో స్క్రీన్ సహాయంతో చరణ్ మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. అందులో భాగంగానే సంస్కారానికి మారుపేరు మా అన్నయ్య చిరంజీవి అని నాగార్జున ప్రత్యేకంగా చెప్పడం మెగా ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్, ఆచార్య తాలూకు విశేషాలు కూడా చర్చకు వచ్చాయి.

ఇక మాస్ట్రో టీమ్ ఎంట్రీ కూడా హంగామా చేసింది. నితిన్ ముందు కళ్ళజోడు పెట్టుకుని రాగా చరణ్ కామెడీ టైమింగ్ తో అది తీసేసి నితిన్ అందరితో కలిసి అక్కడే డాన్స్ చేసేశాడు. అనంతరం నాగార్జున క్లాసుల ప్రహసనం మొదలయ్యింది. బూతులు మాట్లాడినందుకు ఉమాతో గుంజిళ్ళు తీయించడం కొంత ఎబ్బెట్టుగానే ఉంది. ఆవిడ వయసుని పరిగణించాల్సింది. నామినేషన్లలో లోబో, పింకీ, హానీలు సేవ్ అయ్యారు. లిస్ట్ లో ఉన్న మిగిలిన నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఉమానే ఎలిమినేట్ అయ్యారని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి కొంత గ్యాప్ తర్వాత బిగ్ బాస్ 5 షో మంచి ఎంజాయ్ చేసే రేంజ్ లో సాగింది. అది చరణ్ వల్లే అనేది స్పష్టం

Also Read: పాత సినిమాలకు కొత్త రోజులొచ్చాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp