ఊహించని దర్శకుడితో సూపర్ స్టార్

By iDream Post May. 04, 2021, 05:30 pm IST
ఊహించని దర్శకుడితో సూపర్ స్టార్

హిట్లు ఫ్లాపులు ఎన్ని వచ్చినా వాటితో నిమిత్తం లేకుండా ఒకేరకమైన క్రేజ్ ని మైంటైన్ చేసే హీరోల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు ఇక్కడి స్టార్లతో సమానంగా భారీ మార్కెట్ ఉండేది కానీ వరుసగా వచ్చిన డిజాస్టర్లతో దాని మీద కొంత ప్రభావం పడిన మాట వాస్తవం. అయితే తమిళనాడులో మాత్రం రజని హవా ఇంకా జోరుగానే సాగుతోంది. ఇక్కడ దర్బార్ దెబ్బ కొట్టినా అక్కడ మాత్రం వంద కోట్ల దాకా రాబట్టి తలైవా స్టామినాని రుజువు చేసింది. తాజాగా రజిని హైదరాబాద్ లోనే అన్నాతే షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడే తన భాగం మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత చెన్నై వెళ్ళిపోతారు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం రజనీకాంత్ తన నెక్స్ట్ మూవీని యువ దర్శకుడు దేసింగ్ పెరియస్వామితో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెన్నై ఫిలిం టాక్. ఇతని పేరు చెబితే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన కనులు కనులు దోచాయంటే డైరెక్టర్ అంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. దుల్కర్ సల్మాన్, రీతువర్మ జంటగా ఇతను రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ ఎంతగా స్పందన దక్కించుకుందో చూశాం. తెలుగులోనూ బాగానే ఆడింది. పబ్లిసిటీలో జరిగిన లోపం వల్ల లేట్ గా రీచ్ అయ్యింది కానీ ఓటిటి శాటిలైట్ లో ఈ సినిమా చూసి మెచ్చుకున్నా ప్రేక్షకులు ఎందరో.

ఇటీవలే పెరియస్వామి రజనికి చెప్పిన ఒక లైన్ నచ్చడంతో పూర్తిగా డెవలప్ చేశాక డిసైడ్ చేద్దామని చెప్పారట. అయితే అది ఏ జానర్ అనేది మాత్రం బయటికి రాలేదు. డిఫరెంట్ గా ఆలోచించే ఇలాంటి యంగ్ టాలెంట్ ని సీనియర్ హీరోలు ప్రోత్సహించడం చాలా అవసరం. అయితే వీళ్ళు కూడా రజని ఇమేజ్ కి లోబడే కథలు రాసుకుని ప్రెజెంట్ చేయడం కొంత నిరాశ కలిగిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ ఇదే తరహాలో పేటతో అంతగా సంతృప్తినివ్వని సంగతి అందరికీ గుర్తే. మరి దేసింగ్ పెరియస్వామి అయినా ఏదైనా కొత్తగా ట్రై చేసి చూపిస్తాడేమో వేచి చూడాలి. ఇంకో నెల రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు రానున్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp