35 ఏళ్ళ తర్వాత క్రేజీ కాంబినేషన్

By Ravindra Siraj Jan. 25, 2020, 12:22 pm IST
35 ఏళ్ళ తర్వాత క్రేజీ కాంబినేషన్

ఒకే స్థాయిలో ఇద్దరు స్టార్లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల కలయికను చూసి అభిమానులు తెగమురిసిపోయేవారు. ఆ తర్వాతి తరాలు మాత్రం ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగించలేకపోయాయి. అంచనాల పేరుతో కలిసే అవకాశం వచ్చినా తప్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఈ కల్చర్ పెరుగుతోంది.

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ల క్రేజీ కాంబో త్వరలో సాధ్యమయ్యే అవకాశం ఉందంటూ చెన్నై ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. వాటి ప్రకారం సిరుతై శివ దర్శకత్వంలో తన 168వ సినిమా చేస్తున్న రజనీకాంత్ అది పూర్తి కాగానే కమల్ హసన్ స్వంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్ నేషనల్ కు కమిట్ అయ్యాడు. అంతా సవ్యంగా కుదిరితే అదే సినిమాలో కమల్ కూడా నటిస్తాడట. అది క్యామియోనా లేక ఫుల్ లెంత్ రోలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద చివరిసారి కనిపించిన సినిమా 1985లో వచ్చిన హింది గిరఫ్తార్. దాని కన్నా ముందు అందమైన అనుభవం, అల్లాయుద్దీన్ అద్భుత దీపం, వయసు పిలిచింది లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఈ కాంబోలో వచ్చాయి. ఇద్దరికీ స్టార్ డం విపరీతంగా పెరిగిపోయాక మళ్ళీ ఇది సాధ్యపడలేదు. ఇప్పుడీ సినిమాకు ఖైదీతో సౌత్ లో ఎంతో పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడట. ప్రస్తుతం ఇతను విజయ్ తో మాస్టర్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పడీ స్టార్లు ఇద్దరినీ డీల్ చేసే ఛాన్స్ దక్కిందంటే ఇతని కంటే అదృష్టవంతుడు వేరే ఉంటాడా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp