రాజమౌళి త్వరపడక తప్పదు

By iDream Post Sep. 27, 2021, 02:30 pm IST
రాజమౌళి త్వరపడక తప్పదు

మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకోవడానికి\ అక్టోబర్ 22 నుంచి అనుమతులు ఇవ్వడం ఆలస్యం నిన్న ఒక్క రోజే 14కి పైగా బాలీవుడ్ సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటించాయి. అమీర్ ఖాన్ తన లాల్ సింగ్ చద్దాను 2022 ఫిబ్రవరి 14కి లాక్ చేయగానే నిమిషాల వ్యవధిలో ప్రకటనలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ ప్రవాహం చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏకంగా 2023 దాకా ఒక్కొక్కరు విడుదల తేదీలను చెప్పేసుకుంటూ పోయారు. సూర్య వంశీ దీపావళికి కన్ఫర్మ్ కాగా 83ని ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ పండగ కానుకగా తీసుకొస్తున్నాయి. ఇవి సంవత్సర కాలంగా ల్యాబులో మగ్గుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కాకుండా బంటీ ఔర్ బబ్లీ 2, తడిప్, జెర్సీ, పృథ్విరాజ్, జయేష్ బాయ్ జోర్దార్, బచ్చన్ పాండే, శంషేరా, భూల్ భులాయ్యా 2, మే డే, హీరోపంటి 2, రక్షాబంధన్, రామసేతు, చండీగఢ్ కరే ఆషీకీ ఇలా క్యూ కట్టి మరీ అనౌన్స్ మెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రధాన వాణిజ్య కేంద్రమైన ముంబైలో థియేటర్లు తెరవబోతున్నారనే వార్త దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ రాష్ట్రాన్ని పక్కనపెట్టి సినిమాలు విడుదల చేస్తే ఎంత దెబ్బ పడుతుందో బెల్ బాటమ్ నిరూపించాక గత రెండు వారాల నుంచి ఒక్కటంటే ఒక్కటి బాలీవుడ్ మూవీ రాలేదు. ఇంకో నెల దాకా కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే అక్టోబర్ నుంచి ఈ తాకిడి.

ఇప్పుడీ పరిణామాలు ఆర్ఆర్ఆర్ ని ఇరకాటంలో పెట్టేశాయి. అక్టోబర్ 13 నుంచి పోస్ట్ పోన్ అయ్యాక కొత్త డేట్ ని ఇంకా చెప్పలేదు. 2022 సంక్రాంతి అంటున్నారు కానీ అదీ అనుమానమే. ఆల్రెడీ రాధే శ్యామ్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట కర్చీఫ్ వేసుకున్నాయి. ఆచార్య వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే వేసవికి వెళ్లే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు టాక్ వచ్చింది. అక్కడ చూస్తేనేమో హిందీ సినిమాలు చాలా తెలివిగా డేట్లను బుక్ చేసుకుంటున్నాయి.కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14కే కట్టుబడి ఉంది. మరి ఆర్ఆర్ఆర్ కూడా ఇదే తరహాలో ఏదో ఒక డేట్ అనేసుకుని చెప్పుకుంటే బెటర్. క్లాష్ కు సంబంధించి ఇబ్బందులు రాకుండా ఉంటాయి

Also Read : ప్రభాస్ VS అక్షయ్ - పోటీ బాగుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp