రంగంలోకి రగడ దర్శకుడు ?

By iDream Post Jul. 13, 2020, 12:18 pm IST
రంగంలోకి రగడ దర్శకుడు ?

వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా గట్టి హిట్టు లేక అన్ని రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కొంచెం తగ్గు ముఖం పట్టాక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోతారు. ఇంకో నెల రోజులు నిరవధికంగా కొనసాగిస్తే అంతా అయిపోతుందని తెలిసింది. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ ఆడియో సింగల్ రిలీజయ్యింది. దీని తర్వాత సైరా ఫేం సురేందర్ రెడ్డి అఖిల్ కోసం ఓ స్టొరీ సిద్ధం చేసినట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ కు నచ్చేలా చెప్పినట్టు వినికిడి.

దీని సంగతలా ఉంచితే అఖిల్ ఆరో సినిమాకు కూడా బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందట. నాగార్జునకు గతంలో రగడ రూపంలో స్టైలిష్ హిట్ ఇచ్చిన వీరు పొట్ల అఖిల్ కు నప్పేలా ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో కథ చెప్పారట. నాగ్ కు ఇతని మీద ఎలాగూ నమ్మకం ఉంది. రగడ మేకింగ్ టైంలో పనితనం చూశాడు కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో అంత ఆలస్యం చేయకపోవచ్చు.కాకపోతే బొమ్మరిల్లు భాస్కర్ లాగా ఇతని ట్రాక్ రికార్డ్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. గత రెండు సినిమాలు మంచు విష్ణు దూసుకెల్తా, సునీల్ ఈడు గోల్డ్ ఎహే ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. మొదటి రెండు బిందాస్, రగడ మాత్రమే హిట్ గా నిలిచాయి. అందుకే వీరు పొట్ల నాలుగేళ్ల నుంచి గ్యాప్ లోనే ఉన్నారు.

మరి అఖిల్ కోసం ఎలాంటి లైన్ సిద్ధం చేశారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే నిజానికి అఖిల్ చేసిన మూడు సినిమాలు హిట్ డైరెక్టర్స్ వే. కాని కథల విషయంలో చేసిన పొరపాట్లతో పాటు టేకింగ్ దెబ్బ కొట్టడంతో డిజాస్టర్లు తప్పడం లేదు. అందుకే ఈసారి రివర్స్ గేర్ లో ఇలా ఫ్లాప్ ట్రాక్ లో ఉన్న దర్శకులను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్య ఎంత హిట్లు కొడుతున్నప్పటికి ఇంకా స్టార్ ఓపెనర్ రేంజ్ కి వెళ్ళలేదు. అందుకే అభిమానుల ఆశలన్నీ అఖిల్ మీదే ఉన్నాయి. ఇప్పుడు చూస్తేనేమో బ్యాచిలర్ కు లాక్ డౌన్ బ్రేకులు. సో ఏది ఎలా ఉన్నా 2021 నుంచైన అక్కినేని వారసుడి లక్ బాగుంటుందేమో చూడాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp