మెగా 'గని'కి రాధే శ్యామ్ టెన్షన్

By iDream Post Feb. 09, 2021, 02:34 pm IST
మెగా 'గని'కి రాధే శ్యామ్ టెన్షన్

అదేంటి వరుణ్ తేజ్ గనికి రాదే శ్యామ్ కి లింక్ ఏమిటనుకుంటున్నారా. అసలు కథ వేరేదుంది. ఈ నెల 14న ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ టీజర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది ఎలా ఉంటుందన్న ఆసక్తి సగటు ప్రేక్షకుల్లోనూ విపరీతంగా ఉంది. అదే రోజు అందులోనే రిలీజ్ డేట్ ఖచ్చితంగా ఇస్తారనే అంచనా కూడా బలంగా ఉంది. అయితే అది ఏ తేదీ అయ్యుండొచ్చన్న ఊహాగానాలు మాత్రం ఎవరూ పక్కాగా చేయలేకపోతున్నారు. యువి సంస్థ ఈ విషయంలో ముందు నుంచి ప్రదర్శిస్తున్న అలసత్వం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో సాహో కూడా ముందు చెప్పింది కాకుండా డేట్ మార్చాల్సి వచ్చింది.

ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం రాధే శ్యామ్ ని జూలై 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కు ప్లాన్ చేయబోతున్నట్టు తెలిసింది. అదే రోజు తమ సినిమాను తెస్తున్నామని వరుణ్ తేజ్ గని నిర్మాతలు ఎప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. ఇప్పుడు రాధే శ్యామ్ తో డైరెక్ట్ గా గని ఢీ కొట్టలేడు. ఇమేజ్ లోనూ, మార్కెట్ లెక్కల్లోనూ ప్రభాస్ కు వరుణ్ కు మధ్య ఉన్న వ్యత్యాసం తెలియంది కాదు. అలాంటప్పుడు అనవసరంగా పోటీకి దిగితే థియేటర్ల కౌంట్ పరంగానే కాకుండా ఓపెనింగ్స్ లోనూ గని నష్టాలు ఎదురుకోవాల్సి వస్తుంది. అయితే రాధే శ్యామ్ అధికారిక ప్రకటన వస్తే తప్ప దీనికి సంబంధించిన క్లారిటీ రాదు.

నిజానికి ఇలాంటి భారీ క్లాష్ లు లాక్ డౌన్ అయినప్పటి నుంచి తప్పడం లేదు. పది నెలలకు పైగా సుదీర్ఘ విరామం రావడంతో నిర్మాతలు పోటీ పడి మరీ రిలీజ్ లు అనౌన్స్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆన్ సీజన్ గా భావించే ఫిబ్రవరిలోనూ వారానికి మూడు నాలుగు సినిమాలు కాంపీట్ కాక తప్పడం లేదు. దీని వల్ల వసూళ్ల మీద ప్రభావం పడుతున్నా కూడా ఎవరూ ఏమి చేయలేకపోతున్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా నిస్సహాయంగా మిగిలిపోతోంది. మరి గనిని టెండర్ పెట్టిన రాధే శ్యామ్ మనసు మార్చుకుని ఇంకో ఆప్షన్ చూసుకుంటాడా లేదా ఇంకో అయిదు రోజుల్లో తేలిపోవచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp