పోలీస్ అనగానే ఆవిడే గుర్తొస్తారు

By iDream Post Aug. 04, 2020, 08:58 pm IST
పోలీస్ అనగానే ఆవిడే గుర్తొస్తారు

ఢిల్లీలో పుట్టిపెరిగినా అచ్చ తెలుగు అందంలా విరుస్తూ మెరిసిపోయే రాశి ఖన్నా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 7 ఏళ్ళ క్రితం ఊహలు గుసగుసలాడేతో పరిచయమై డెబ్యూతోనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీని హిట్ రూపంలో తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత తక్కువ టైంలోనే గోపీచంద్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ లాంటి స్టార్లతో చేసే అవకాశాలు, సూపర్ సక్సెస్ లు చాలానే దక్కించుకుంది. కోలీవుడ్ లోనూ తన లక్ ని పరీక్షించుకుంటూ ఆఫర్స్ పట్టేస్తున్న రాశి ఖన్నాకు తొలిప్రేమ రూపంలో మరో పెద్ద బ్రేక్ వచ్చాక ఇన్నింగ్స్ ఇంకాస్త వేగం అందుకున్నాయి.

గత ఏడాది ప్రతి రోజు పండగేతో పాటు వెంకీ మామలో చైతుతో ఆడి పాడి డబుల్ హిట్స్ ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నా ఈ ఏడాది వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఒక్కటే నిరాశపరిచింది. పాత్ర పరంగా తను బెస్ట్ ఇచ్చినప్పటికీ కథలో ఉన్న లోపల కారణంగా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం తమిళ్ లో సూర్యతో చేస్తున్న భారీ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా కొత్తగా తెలుగు ప్రాజెక్ట్స్ ఏవి ఒప్పుకోలేదు. ఇక తనకు స్పెషల్ గా నిలిచిపోయే చిత్రంగా ఈ అందాల తార సుప్రీమ్ గురించి చెబుతూ ఉంటుంది. సాయి ధరం తేజ్ తో మొదటిసారి జోడి కట్టి చేసిన ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ శ్రీదేవిగా నటించడం మర్చిపోలేని అనుభూతిగా చెబుతుంది.

కొంచెం మాస్ టచ్ తో పాటు ఫన్ యాంగిల్ ఉన్న ఆ రోల్ ని బాగా ఎంజాయ్ చేసేదట. వెండితెరపై పోలీస్ ఆఫీసర్ అనగానే తనకు గుర్తొచ్చేది లేడీ అమితాబ్ విజయశాంతినే. కర్తవ్యం సినిమాలో తన పెర్ఫార్మన్స్ చూశాక ఇంతకంటే బాగా ఎవరూ చేయలేరని డిసైడ్ అయ్యిందట. అంతగా ప్రభావం చూపించిన విజయశాంతి లాంటి వాళ్ళు చేసిన పాత్రలో ఒదగడం అంత సులభం కాకపోయినా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రోత్సాహంతో సులువుగా చేసేసి మంచి పేరు తెచ్చుకుంది. సుప్రీమ్ తర్వాతే రాశి ఖన్నాకు మాస్ సినిమాల్లో అవకాశాలు క్యు కట్టాయి. ఊహలు గుసగుసలాడేకు పూర్తి విరుద్ధమైన పాత్రను చేసి మెప్పించడం అంటే మాటలు కాదుగా. అందుకే బెల్లం శ్రీదేవిగా అలా ప్రేక్షకుల మదిలో ప్రింట్ అయిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp