అయిదు గంటల అడవి కథ

By iDream Post May. 12, 2021, 04:00 pm IST
అయిదు గంటల అడవి కథ
ముందే చెప్పినట్టు పుష్ప రెండు భాగాలు కన్ఫర్మ్ అయ్యాయి. నిన్నటి దాకా కేవలం గాసిప్ గానే నిలిచిన ఈ వార్త ఎట్టకేలకు నిర్మాత ద్వారానే అఫీషియల్ అయిపోయింది. అధికారిక పోస్టర్ లేదా టీజర్ ద్వారా చెప్పలేదు కానీ ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడంతో అనుమానాలు తీరిపోయాయి. బిజినెస్ కోణంలో సీక్వెల్ ని ప్లాన్ చేయలేదని కేవలం కథ డిమాండ్ మేరకే డిటైల్డ్ గా చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు అది కూడా గత ఏడాదే ఫిక్స్ అయ్యామని చెప్పడం గమనించాల్సిన అంశం. అంటే ప్రచారం ఇప్పుడు జరిగింది కానీ కన్ఫర్మేషన్ ఎప్పుడో అయ్యిందన్న మాట. సో పుష్ప ఐదు గంటల వినోదాన్ని మోసుకొస్తాడన్న మాట.

ఇక్కడ పుష్ప చాలా స్పష్టంగా కెజిఎఫ్ ఫార్ములాను వాడినట్టు కనిపిస్తోంది. బాహుబలి ఈ విషయంలో అందరికీ మార్గం చూపించినప్పటికీ అది ఫాంటసీ మూవీ కనక కమర్షియల్ సినిమాతో ముడిపెట్టి పోల్చలేం. మినహాయింపుగా చూడాలి. ఇక మిగిలిన హీరోలు గతంలో చాలా సీక్వెల్స్ చేశారు కానీ అధిక శాతం మొదటి భాగం కథకు కొనసాగింపులు కాదు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలోనే వచ్చిన ఆర్య 2కి ఆర్యకు అసలు పోలిక ఉండదు. రెండు సంబంధం లేని కథలు. కిక్, సర్దార్ గబ్బర్ సింగ్ ఇలా ఏ ఉదాహరణ తీసుకున్న ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పుష్ప అలా కాదు. కథ క్లియర్ గా కంటిన్యూ చేస్తారు.

ప్రత్యేకంగా మరో ఐటెం సాంగ్ ని కూడా జోడించబోతున్నట్టు తెలిసింది. అయితే ఎవరు డాన్సు చేస్తారనేది మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్పలో రష్మిక మందన్న హీరోయిన్. ఎంతలేదన్నా ఒక్కో భాగం రెండున్నర గంటల నిడివి వస్తుంది. అంటే పుష్ప సబ్జెక్టు అయిదు గంటల డ్యూరేషన్ ని డిమాండ్ చేసిందంటే సుకుమార్ ఏ స్థాయిలో అడవిలో అరాచకాలను చూపించబోతున్నాడో అర్థమవుతుంది. విలన్ ఫహద్ ఫాజిల్ అంత లెన్త్ లో ఉంటాడా లేక ఏమైనా తక్కువ నిడివి ఉంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి పుష్ప  దసరాకు వచ్చే ఛాన్స్ ఉంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp