పూరి జగన్నాధ్ గేమ్ ప్లాన్ ఛేంజ్

By iDream Post Jul. 13, 2020, 01:29 pm IST
పూరి జగన్నాధ్ గేమ్ ప్లాన్ ఛేంజ్

స్టార్ ఎవరైనా వేగంగా సినిమాలు తీస్తాడని పేరున్న పూరి జగన్నాధ్ కు సైతం లాక్ డౌన్ సెగలు గట్టిగా తగిలాయి. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిస్తున్న ఫైటర్(ప్రచారంలో ఉన్న టైటిల్)కీలక షెడ్యూల్ ముంబైలో జరుగుతుండగా కరోనా వల్ల అందరితో పాటు ఇప్పటికే మూడు నెలలకు పైగా బ్రేక్ పడింది. షూటింగులకు తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇచ్చాయి కానీ ముంబై పరిస్థితి మాత్రం సీరియస్ గానే ఉంది. ఈ నేపథ్యంలో అదే లొకేషన్స్ లో కొనసాగించడం ఇప్పట్లో జరిగే పనిలా కనిపించడం లేదు. పైగా మనది కాని చోటులో కఠినమైన నిబంధనలు పాటిస్తూ షూట్ చేయడం అంటే అంత సులభం కాదు.

అందుకే ఇప్పుడు హైదరాబాద్ లోనే ముంబైను పోలిన ప్రదేశాల్లో ఫైటర్ ని కంటిన్యూ చేసేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. అయినా కూడా ఇప్పటికిప్పుడు కెమెరా లైట్స్ ఆన్ అనలేరు. కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఎవరూ రిస్క్ తీసుకోవడం లేదు. ఈ ఖాళీ సమయాన్ని పూరి రీ షెడ్యూలింగ్ కోసం వాడుకుంటున్నట్టు తెలిసింది. దీంతో పాటు మరో ట్విస్ట్ కూడా ప్రచారంలోకి వచ్చింది. దీన్ని పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు కాబట్టి సంగీత దర్శకుడిగా మణిశర్మ కంటే బాలీవుడ్ నుంచి ఎవరైనా కంపోజర్ అయితే బాగుంటుందని హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చెప్పారట. అందుకే ఈ విషయంగానూ చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది.

నిజానికి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ లో సంగీతం పోషించిన పాత్ర చాలా పెద్దది. దాని దెబ్బకే ఇంత కాలం పెద్ద ఆఫర్స్ లేని మణిశర్మ ఏకంగా ఆచార్య, నారప్ప లాంటి క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకున్నారు. సుమారు పది దాకా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఫైటర్ చేజారిపోయినా నష్టమేమి ఉండదు కానీ అది పూరికే ఇబ్బంది కలిగించే విషయం. అయితే ఇదంతా ఫిలిం నగర్లో జరుగుతున్న డిస్కషన్ లో భాగంగా వచ్చిన న్యూసే తప్ప అధికారికంగా ఇంకా ఎలాంటి ధృవీకరణ రాలేదు. అనన్య పాండే హీరోయిన్ గా రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లిగా నటిస్తున్న ఫైటర్ మీద హీరోతో అభిమానులు కూడా బోలెడు అంచనాలతో ఉన్నారు. గత కొంతకాలంగా వరస పరాజయాలతో కొంచెం డౌన్ లో ఉన్న విజయ్ దేవరకొండకు దీని సక్సెస్ చాలా కీలకం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp