డార్లింగ్ కు రైట్ ఛాయస్ దొరకడం లేదా

By iDream Post Mar. 14, 2021, 03:33 pm IST
డార్లింగ్ కు రైట్ ఛాయస్ దొరకడం లేదా

బాహుబలి, సాహోలో జరిగిన జాప్యం వల్ల విలువలైన కాలాన్ని చాలా కోల్పోయిన ప్రభాస్ దానికి మించి నేషనల్ లెవెల్ లో ఇమేజ్ ని మార్కెట్ ని సంపాదించుకువడం అభిమానులకు సంతోషంగానే ఉన్నా వరసగా ప్రాజెక్టులు ఒప్పుకుని శరవేగంగా షూటింగులు పూర్తి చేసుకోవడం అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. రాధే శ్యామ్ విడుదల తేదీ ప్రకటించినప్పటికీ ఇంకా గూస్ బంప్స్ ఇచ్చే ప్రమోషన్ మెటీరియల్ ఏదీ ఇప్పటిదాకా బయటికి రాలేదు. సరే ట్రైలర్ వచ్చాక సర్దుకుంటాయి అదే హైప్ వచ్చేస్తుందని సర్దిచెప్పుకోవడం మినహా వాళ్ళు మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. ఇక అసలు విషయానికి వద్దాం.

ప్రభాస్ స్పీడ్ గా సినిమాలు చేయడం బాగానే ఉంది కానీ తనకు జోడిగా నటిస్తున్న హీరోయిన్ల విషయంలోనే ఫ్యాన్స్ అంత హ్యాపీగా లేనట్టు కనిపిస్తోంది. నిన్న ఆది పురుష్ లో జోడిగా సీత పాత్రకు కృతి సనన్ ని ఎంపిక చేయడం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని నార్త్ ఆడియన్స్ కనెక్టివిటీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కియారానో లేదా కీర్తి సురేష్ లాంటి వాళ్ళను ఎంచుకుంటే ఇంకా బెటర్ గా ఉండేదని వాళ్ళ అభిప్రాయం. ఏడేళ్ల ముందు తెలుగులో ఫ్లాప్ సినిమాలు చేసి మాయమైపోయిన కృతి సనన్ కి బాలీవుడ్ లోనూ కత్రినా రేంజ్ మార్కెట్ ఏమి లేదు

ఇక సలార్ లో శృతి హాసన్ సెలక్షన్ పట్ల కూడా ఇదే రెస్పాన్స్ ఉంది. మన స్టార్ హీరోలు ఎప్పుడో పక్కనపెట్టిన తనను తీసుకోవడం ఏమిటా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే సలార్ పూర్తిగా హీరోయిజం ఆధారంగా నడిచే యాక్షన్ డ్రామా. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అందులోనూ డేట్లు కాస్త ఎక్కువగా అవసరమవుతాయి. అందుకే రాజీ పడక తప్పలేదనే టాక్ ఉంది. ఒక్క రాధే శ్యామ్ విషయంలోనే ఎలాంటి కంప్లయింట్ లేదు. పూజా హెగ్డే కన్నా బెస్ట్ ఛాయస్ లేదు కాబట్టి. రెండేళ్లలో మూడు సినిమాలతో రాబోతున్న ప్రభాస్ ఆ తర్వాత నాగ అశ్విన్ దర్శకత్వం కోసం ఇంకో రెండు సంవత్సరాలు త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp