ప్రభాస్ పాన్ ఇండియా స్పీడ్ మాములుగా లేదు

By iDream Post Oct. 10, 2021, 06:30 pm IST
ప్రభాస్ పాన్ ఇండియా స్పీడ్ మాములుగా లేదు

ఊహించిన దానికన్నా చాలా వేగంగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు షూటింగులు పూర్తి చేసుకుంటున్నాయి. ఆది పురుష్ లో విలన్ అదే రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ తన భాగాన్ని పూర్తి చేసేసి నిన్న ఫేర్ వెల్ కూడా తీసుకున్నాడు. ప్రభాస్ తో పాటు ఇతర ఆర్టిస్టులతో ఉన్న కాంబినేషన్ సీన్లన్నీ దర్శకుడు ఓం రౌత్ పూర్తి చేశారట. ఇంత వేగం ఎవరూ ఊహించనిది. బాహుబలి నుంచి ఇలాంటి గ్రాండియర్స్ కి కనీసం రెండేళ్లు పడుతుందన్న అంచనాలో ఉన్న జనాలకు బాలీవుడ్ మేకర్ గట్టి షాక్ ఇచ్చాడు. నాలుగు వందల కోట్ల బడ్జెట్ అని చెప్పుకున్న ఆది పురుష్ ఇంత ఫాస్ట్ గా జరుగుతోందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. దానికో కారణం ఉంది

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ విజువల్ ఎఫెక్ట్స్ డిమాండ్ చేసేవే. సాహో, రాధే శ్యామ్ లకు లొకేషన్ల వల్ల జాప్యం ఎక్కువ జరిగింది. కానీ ఆది పురుష్, సలార్ లకు ఆ సమస్య లేదు. రెండూ ఇండియాలోనే అది కూడా పరిమిత ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంటున్నాయి. సో టాకీ పార్ట్ అయ్యాక గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించబోతున్నారు. దీనికి ప్రభాస్ ప్రమేయం అవసరం లేదు. కాకపోతే పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓం రౌత్ అందుకే జాగ్రత్త పడి సిజి వర్క్ కి ఆరు నెలల టైం ఫిక్స్ చేయడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదట. సో ఇకపై డార్లింగ్ సినిమాలు లేట్ అవ్వడం జరగకపోవచ్చు.

ఇవి కాకుండా నాగ అశ్విన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కె, సందీప్ రెడ్డి వంగాతో ఇటీవలే ప్రకటించిన స్పిరిట్ తాలూకు జానర్ అండ్ బడ్జెట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ తో చేయబోయే సినిమా తాలూకు అనౌన్స్ మెంట్ పెండింగ్ లో ఉంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు చర్చల ఫైనల్ స్టేజిలో ఉన్నాయని ఫిలిం నగర్ టాక్. చూస్తుంటే ప్రభాస్ రాబోయే అయిదేళ్ల వరకు మాములు దూకుడు చూపించడానికి ఇష్టపడటం లేదనిపిస్తోంది.ఇంతకన్నా అభిమానులకు కావాల్సింది ఏముంటుంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చాలా చాలా స్పెషల్ స్టఫ్ ఫ్యాన్స్ కోసం రాబోతోంది. చూద్దాం

Also Read : 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp