స్పీడు పెంచిన రెబెల్ స్టార్ - మరో పాన్ వరల్డ్ సినిమా

By iDream Post Oct. 07, 2021, 12:30 pm IST
స్పీడు పెంచిన రెబెల్ స్టార్ - మరో పాన్ వరల్డ్ సినిమా

తన కెరీర్ లో చాలా కీలకమైన సమయాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్న బాహుబలి, సాహో తర్వాత డార్లింగ్ ప్రభాస్ స్పీడ్ తగ్గించేందుకు ఇష్టపడటం లేదు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే అయినప్పటికీ పూర్తి చేయడంలో మాత్రం యమా దూకుడు చూపిస్తున్నాడు. అసలు కరోనా రాకపోయి ఉంటే రాధే శ్యామ్ తో పాటు మరో చిత్రాన్ని అభిమానులకు అందించేవాడు. కానీ అందరికీ కలిగిన పరిస్థితే తనకూ అడ్డం పడింది. ప్రస్తుతం ఆది పురుష్ ని పూర్తి చేసే పనిలో ఉన్న రెబెల్ స్టార్ ఆ తర్వాత సలార్ మీద ఫోకస్ పెట్టి ఆపై ప్రాజెక్ట్ కె లో జాయిన్ అవుతాడు. వీటి మధ్యలోనే మరో ప్రెస్టీజియస్ మూవీని అనౌన్స్ చేయించాడు.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి సిరీస్, యువి సంయుక్తంగా నిర్మించబోయే భారీ సినిమాని ఇందాక అధికారికంగా ప్రకటించారు. దీన్ని 8 భాషల్లో విడుదల చేస్తారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, చైనీస్, కొరియన్, జాపనీస్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో అధిక వెర్షన్లు డబ్బింగ్ రూపంలో ఉండొచ్చు. ఇంత స్థాయిలో వరల్డ్ వైడ్ వెళ్తున్న సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాసే అనొచ్చు. ఇది వచ్చే లోగా మిగిలిన స్టార్ హీరోలు కూడా ఇదే బాటలో ఆయా లాంగ్వేజెస్ లో తమ సినిమాలు రిలీజ్ చేయొచ్చేమో కానీ మొదటి ఘనత మాత్రం ప్రభాస్ కే దక్కుతుంది.

ఇది పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేలోగా 2023 దాటొచ్చు. టైటిల్ లో స్టార్స్ ని చూస్తుంటే ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయబోతున్నాడన్న అంచనా కలుగుతోంది. ఇప్పటిదాకా డార్లింగ్ పూర్తి స్థాయి ఖాకీ డ్రెస్ వేయలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి గూస్ బంప్సే. హీరో క్యారెక్టరైజేషన్ లో ఒక డెఫినిషన్ ని అర్జున్ రెడ్డి ద్వారా చూపించిన సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రన్వీర్ కపూర్ తో చేస్తున్న అనిమల్ పూర్తయ్యాక స్పిరిట్ పనుల్లో పడిపోతారు. హీరోయిన్ ఇతరత్రా టెక్నీకల్ టీమ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. మొత్తానికి ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టు స్పిరిట్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో స్వీట్ షాక్ ఇచ్చారు మేకర్స్

Also Read : రేపటి బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp