ప్రభాస్ 21 హాట్ అప్డేట్

By iDream Post Apr. 25, 2020, 01:06 pm IST
ప్రభాస్ 21 హాట్ అప్డేట్

సాహో తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసిన ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అయినా త్వరగా పూర్తి చేద్దామనుకుంటే ఆ ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. దాని వల్లే జార్జియా నుంచి షెడ్యూల్ ని అర్ధాంతరంగా ఆపేసి ఇండియా రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఎలా ఎక్కడ కొనసాగుతుందో నిర్మాతకు కూడా తెలియదు. ఇదిలా ఉండగా దీని తర్వాత నాగ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోయే 21వ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.

దాని ప్రకారం ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంచుకోబోతున్నట్టు సమాచారం. నేరుగా కలిసే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిస్కషన్ జరిగిందట. మహేష్ బాబు భరత్ అనే నేను, రామ్ చరణ్ వినయ విధేయ రామ తర్వాత కియారా ఇంకే తెలుగు సినిమా ఒప్పుకోలేదు. బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తోంది. కానీ ఇప్పుడు వచ్చింది బాహుబలి స్టార్ ఆఫర్ కాబట్టి నో చెప్పే ఛాన్స్ తక్కువ. నాగ అశ్విన్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఇది ఉంటుందని ఇప్పటికే లీకులు వచ్చాయి.

బడ్జెట్ కూడా సాహోని మించి ఉంటుందని వినికిడి. ఫిగర్ ఎంతనే లెక్క బయటికి రాలేదు కానీ నిర్మాత అశ్వినీదత్ కెరీర్ లోనే కాస్ట్లీ మూవీ అనే క్లారిటీ అయితే వచ్చేసింది. లాక్ డౌన్ త్వరగా పూర్తయి ప్రభాస్ 20 ఫినిష్ అయిపోతే డిసెంబర్ లోనే నాగ అశ్విన్ సినిమా మొదలు పెడతారు. ఇంకా ఆలస్యం అనివార్యమైతే తర్వాత నిర్ణయం తీసుకుంటారు. దీనికి ఎవరు సంగీతం అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మ్యూజికల్ గా కూడా దీన్ని ఇంకో స్థాయిలో నిలబెట్టాలన్నదే దర్శకుడి ప్లాన్ గా వినికిడి. మొత్తానికి ఎవరితో సినిమా చేసినా ప్రభాస్ కు ఏదో ఒక కారణంగా ప్రాజెక్ట్ లేట్ అవ్వడం మాత్రం కామన్ అయిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp