వాయిదా దారిలో మరిన్ని చిత్రాలు

By iDream Post Apr. 07, 2021, 05:30 pm IST
వాయిదా దారిలో మరిన్ని చిత్రాలు
అనుకున్నంతా అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాల్లో ఉదృతంగా లేనప్పటికీ పెద్ద సినిమాల వాయిదా పర్వం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లవ్ స్టోరీ, ఆచార్య, టక్ జగదీశ్, విరాటపర్వంలు పునరాలోచనలో పడగా తాజాగా పుష్ప కూడా ఆగస్ట్ లో వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయని ఇన్ సైడ్ టాక్. ఒత్తిడి మీద తొందపరపడి షూటింగ్ చేయడం కన్నా డిసెంబర్ లేదా జనవరిని టార్గెట్ చేసుకుంటే ప్రమోషన్ తో సహా అన్నీ పక్కాగా చేసుకోవచ్చనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు చెబుతున్నారు. రేపు వదలబోయే పుష్ప రాజ్ క్యారెక్టర్ ఇంట్రో టీజర్లో దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

రాధే శ్యామ్, మేజర్ లు కూడా పరిస్థితులను అంచనా వేయడంలో బిజీ గా ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి ఖచ్చితంగా అన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అంతపెద్ద సూర్యవంశీకే పదే పదే పోస్ట్ పోన్ తప్పడం లేదు. అలాంటిది మనవి అంత సులభంగా రిస్క్ చేయలేవు. పైగా ఓవర్సీస్ లో సిచువేషన్ కూడా ఏమంత గొప్పగా లేదు. జాతిరత్నాలు, మాస్టర్ లాంటి ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ డిస్ట్రిబ్యూటర్లకు సోసో వసూళ్లు తెచ్చినవే. ఉప్పెన యుఎస్ లో పర్వాలేదనిపించుకుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ముందు అనుకున్న నిర్ణయానికి కట్టుబడతారన్న గ్యారెంటీ లేదు.

అందరి కళ్ళు తన మీద పెట్టేసుకున్న కెజిఎఫ్ 2 కూడా ప్రస్తుతానికి మౌనంగానే ఉంది. ట్రైలర్ వదిలే ఆలోచన కూడా చేయడం లేదు. మేలో కరోనా ఏ స్థాయిలో ఉందో గమనించి ఇలాంటి క్రేజీ చిత్రాల ప్రొడ్యూసర్లు విడుదల గురించి ఒక కంక్లూజన్ కు వస్తారు. అప్పటిదాకా అభిమానులకు ఎదురు చూపులు తప్పవు. చూస్తుంటే వేసవిలో వకీల్ సాబ్ తర్వాత అంత ఈజీగా రాబోయే పెద్ద హీరో సినిమా ఏదీ దగ్గరలో కనిపించడం లేదు. తెలంగాణలో పాక్షికంగా కర్ఫ్యులు లాక్ డౌన్ లు పెడితే ఏం చేయాలనే దాని గురించి డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఓ మీటింగ్ పెట్టుకునే ప్లానింగ్ లో ఉన్నారు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp