పూజా హెగ్దే అన్నీ ఒకేసారి చక్కబెట్టేస్తుందట

By Satya Cine Sep. 15, 2020, 07:24 pm IST
పూజా హెగ్దే అన్నీ ఒకేసారి చక్కబెట్టేస్తుందట
కరోనా నేపథ్యంలో వచ్చిన లాక్‌డౌన్‌ నుంచి కాస్త ఉపశమనం దక్కుతోంది సినీ పరిశ్రమకి. మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ షూటింగులతో మళ్ళీ కళకళ్ళాడుతున్నాయి. బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌లలో ఈ పరిస్థితి కనిపించడంలేదు. ఇక, తాజాగా పూజా హెగ్దే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చేసింది. ఇక్కడే కొంతకాలం పాటు వుండిపోనుందట పూజా హెగ్దే. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తోపాటు, ‘రాధే శ్యావ్‌ు’ సినిమా షూటింగ్‌ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది మరి. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ కోసం అఖిల్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తోన్న పూజ, ‘రాధేశ్యావ్‌ు’ కోసం ప్రభాస్‌ సరసన జత కడ్తోన్న విషయం విదితమే. ఈ రెండు కాక, మరో రెండు సినిమాలకు పూజ కమిట్‌ అయ్యిందట తెలుగులో. అది కూడా లాక్‌డౌన్‌ సమయంలోనే కావడం గమనార్హం. అయితే, ఆ సినిమాల వివరాల్ని మాత్రం పూజా హెగ్దే వెల్లడించలేదు. ఆయా సినిమాల షూటింగులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయనీ, ఓ రెండు మూడు నెలలు హైద్రాబాద్‌లోనే వుండి ఆయా షెడ్యూల్స్‌లో తన షూట్‌ పార్ట్‌ని పూజ కంప్లీట్‌ చేసుకోనుందనీ సమాచారం. ఇదిలా వుంటే, పూజా హెగ్దేతో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయించాలనే ఆలోచనతో వున్నారట ఓ నిర్మాత. ఓ యంగ్‌ హీరోతో ఆయన సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ వివరాలు కూడా అతి త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఏదిఏమైనా, ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్‌కి హాజరవడమంటే అంత చిన్న విషయం కాదు. అందుకే, పెద్దగా గ్యాప్‌ లేకుండా ఎడా పెడా సినిమాలు చేసెయ్యాలని పూజా హెగ్దే కూడా ప్లాన్‌ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp