భవదీయుడు భగత్ సింగ్ కి జోడి కుదిరింది

By iDream Post Oct. 09, 2021, 02:30 pm IST
భవదీయుడు భగత్ సింగ్ కి జోడి కుదిరింది

వరసగా సినిమాలు లైన్ లో పెట్టేసి షూటింగులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఎవరుంటారా అనే సస్పెన్స్ కు బ్రేక్ వేస్తూ నిన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ ఈ విషయం చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ సినిమాను గబ్బర్ సింగ్ ని మించిన ఎంటర్ టైన్మెంట్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా జొప్పించారని ఇన్ సైడ్ టాక్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం దీనికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.

ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే ప్రస్తుతం తను పూర్తి చేసిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ నెల 15న థియేటర్లకు రాబోతోంది. రాధే శ్యామ్ వచ్చే జనవరి 14ని ఎప్పుడో లాక్ చేసుకుంది. రామ్ చరణ్ కు జంటగా నటించిన ఆచార్య రిలీజ్ తాలూకు క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. తమిళ్ లో విజయ్ సరసన చేస్తున్న బీస్ట్ షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ఇది వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తేవొచ్చు. హిందీలో చేస్తున్న సర్కస్ సగానికి పైగా పూర్తవ్వగా సల్మాన్ ఖాన్ తో చేయాల్సిన ప్రాజెక్టు గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇవి కాకుండా మరికొన్ని పెండింగ్ లో ఉన్నాయి.

ఇప్పటికే మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ల సరసన చేసిన పూజా హెగ్డే ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సరసనే ఛాన్స్ కొట్టేసింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లలో గ్లామరస్ హీరోయిన్లు సెట్ కాలేదని ఫీలవుతున్న పవన్ ఫ్యాన్స్ కి ఇది మంచి కిక్కిచ్చే వార్త. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక సంక్రాంతి విడుదలకే కట్టుబడితే అప్పుడు భీమ్లా నాయక్ తప్పుకుంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అదే జరిగితే ఏప్రిల్ కి షెడ్యూల్ చేసిన హరిహర వీరమల్లు దసరాకు షిఫ్ట్ అవుతుంది. ఏదీ ముందే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ఫలానా సినిమా ఫలానా తేదీకి వస్తుదేనన్న గ్యారెంటీ ఏమి లేదు. వేచి చూడటం తప్ప ఎవరైనా ఏం చేయగలరు

Also Read : సినీ రాజకీయం ఆఖరి ఘట్టం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp