సుప్రీమ్ హీరో కోసం పొలిటికల్ డ్రామా

By iDream Post Oct. 28, 2020, 12:49 pm IST
సుప్రీమ్ హీరో కోసం పొలిటికల్ డ్రామా

కొంతకాలం వరస డిజాస్టర్లతో ఇబ్బంది పడిన సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఎట్టకేలకు గత ఏడాది చిత్రలహరితో డీసెంట్ హిట్ ని, ప్రతి రోజు పండగేతో బ్లాక్ బస్టర్ ని అందుకుని మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు . ఇప్పుడు రాబోయే సోలో బ్రతుకే సో బెటరూ మీద కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ముందు ఓటిటిలో రావొచ్చని అన్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లోనూ ధియేటర్లు తెరుచుకునే సూచనలు కనిపిస్తుండటంతో నిర్ణయం మార్చుకున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. దీని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్ డేట్ చక్కర్లు కొడుతోంది.

పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రానికి రిపబ్లిక్ అనే టైటిల్ అనుకున్నట్టుగా సమాచారం. ఇందులో నివేత పెతురాజ్ హీరొయిన్ గా నటిస్తోంది. వర్తమాన రాజకీయాలను చర్చిస్తూనే ఒక సీరియస్ ఇష్యూ మీద ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్టుగా తెలిసింది. సాయి తేజ్ మొదటిసారి ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. అంతే కాదు రమ్యకృష్ణ ముఖ్యమంత్రిగా ఎవరూ ఊహించని ఓ డిఫెరెంట్ రోల్ చేస్తారని కూడా తెలిసింది. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సాయి తేజ్ కూడా స్వయంగా డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడు. దీన్ని బట్టి కంటెంట్ మీద గట్టి నమ్మకమే ఉన్నట్టు కనిపిస్తోంది.

గత కొంత కాలంగా సక్సెస్ కు దూరంగా ఉన్న దేవకట్టాకు ప్రస్థానం తర్వాత ఆ స్థాయి సినిమా పడలేదు. ఆ మధ్య దీని బాలీవుడ్ రీమేక్ సంజయ్ దత్ తో తీస్తే దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు తెలుగులో ఆటోనగర్ సూర్య, డైనమైట్ లు కూడా ఇదే ఫలితాన్ని అందుకున్నాయి. ఈ నేపధ్యంలో దేవాకు సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. కథ అంత గొప్పగా వచ్చింది కాబట్టే ఒప్పుకుని ఉంటాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ కూడా సాయి తేజ్ ఓకే చేశాడు. ఇవి కాకుండా ఫైనల్ అయినవి ప్రస్తుతానికి లేవు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp