పొలిటికల్ గేమ్ ఆడిస్తున్న ప్రెసిడెంట్ గిరి

By iDream Post Oct. 07, 2021, 01:30 pm IST
పొలిటికల్ గేమ్ ఆడిస్తున్న ప్రెసిడెంట్ గిరి

కేవలం 3 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలు మరింత గరంగరంగా మారుతున్నాయి. అసలు ఉన్న 900 పైచిలుకు సభ్యుల్లో ఎంత మంది ఓటు వేస్తారో క్లారిటీ లేని తరుణంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా అందరి దృష్టి దీని మీదే పెట్టడం వల్ల సగటు మాములు ప్రేక్షకుడు కూడా వీటి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల క్రికెట్, అసెంబ్లీ ఎలక్షన్స్ తరహాలో బెట్టింగులు జరుగుతున్నాయని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ కు గురవుతున్నాయి. గతంలోనూ హొరాహొరి పోటీ జరిగినప్పటికి మరీ ఈ స్థాయిలో రచ్చకెక్కి రాద్ధాంతం చేయడం లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

నిన్న నాగబాబు, రవిబాబు లాంటి వాళ్ళు బయటికి వచ్చి కొత్తగా స్టేట్ మెంట్లు ఇవ్వడం రెండు వర్గాలకు కొంత ప్లస్ కొంత మైనస్ గా మారింది. ఇది చాలదన్నట్టు నటి హేమ తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఏకంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కళ్యాణి, నరేష్ ల మీద ఫిర్యాదు చేయడం వాతావరణాన్ని వేడెక్కించింది. ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం గత కొద్దిరోజులుగా అందరూ గమనిస్తున్నారు. అయితే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని భారీ ఎత్తున ట్రోలింగ్ జరగడం వల్ల పరిశ్రమ బ్రాండింగ్ కి డ్యామేజ్ జరుగుతోందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎవరేమనుకున్నా ఇది చేయి దాటిపోయింది.

ఇప్పుడు ఎవరు గెలుస్తారనే ఖచ్చితమైన అంచనా వేయడం దుర్లభంగా మారింది. కొత్తగా పోస్టల్ బ్యాలెట్లు, రిగ్గింగ్ లాంటి పదాలు మా సభ్యుల్లో వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ కు మెగా సపోర్ట్ ఉంది కాబట్టి విజేతగా నిలవడం ఖాయమనే పరిస్థితి నుంచి మంచు విష్ణుని సైతం తక్కువ అంచనా వేయడానికి లేదనే స్థాయికి పరిణామాలు మారిపోయాయి. పోలింగ్ రోజు మొదటి ఓటు పోలయ్యే లోపు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుంటాయో వాటిని తమ రేటింగ్స్ కోసం ఎలా వాడుకోవాలో అని కొన్ని న్యూస్ ఛానల్స్ మా ఎన్నికలే ప్రపంచంగా పబ్బం గడుపుతున్నాయి. మరి ఈ మా ప్రెసిడెంట్ గిరి ఎవరికి దక్కుతుందో ఎవరు వెనుదిరుగుతారో వేచి చూడాలి

Also Read : స్పీడు పెంచిన రెబెల్ స్టార్ - మరో పాన్ వరల్డ్ సినిమా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp