పిశాచి సీక్వెల్ లో తడాఖా భామ

By iDream Post Sep. 20, 2020, 09:28 pm IST
పిశాచి సీక్వెల్ లో తడాఖా భామ

ఆరేళ్ళ క్రితం 2014లో వచ్చిన పిశాచి సినిమా గుర్తుందిగా. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ జానర్ లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో సెన్సేషనల్ సక్సెస్ అందుకోగా తెలుగులోనూ డీసెంట్ రన్ కొట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతోంది. తడాఖాలో సునీల్ జోడిగా నటించిన ఆండ్రియా జెరిమియా ఇందులో టైటిల్ రోల్ పోషించబోతోంది. గృహం, డిటెక్టివ్ లాంటి చిత్రాలతో మనకూ దగ్గరైన ఈ బ్యూటీ దెయ్యాల సినిమాలు చేయడం కొత్తేమి కాదు కానీ ఇందులో పాత్ర మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతోందట. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మేల్ లీడ్ గా రాజ్ కుమార్ పిచుమని నటించనున్నాడు.

ఇందులో మరో విశేషం ఉంది. మాస్ట్రో ఇళయరాజా తనయుడు కార్తిక్ రాజా దీంతో కం బ్యాక్ చేయబోతున్నాడు. యువన్ శంకర్ రాజా తరహాలో ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేకపోయిన కార్తీక్ వరస ఫ్లాప్లతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా మీడియా సైతం పెద్దగా పసిగట్టలేకపోయింది. ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీతో మరోసారి తన టాలెంట్ ని చూపించుకోబోతున్నాడు. పిశాచి రీజనబుల్ బడ్జెట్ లో రూపొందగా పిశాచి 2 మాత్రం ఎక్కువ ఖర్చుతో రూపొందబోతోంది. ప్రకటన నుంచే దీని మీద ప్రత్యేకమైన అంచనాలు మొదలయ్యాయి. మొదటి భాగానికి రెండింతలు ఎక్కువ భయం ఇందులో ఉంటుందట.

దీన్ని తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. డిటెక్టివ్ 2 కి సంబంధించి విశాల్ తో వివాదం తలెత్తి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక మిస్కిన్ కొంత కాలం సైలెంట్ గా ఉన్నారు. ఉద్దేశపూర్వకంతో తన మీద అబాంఢాలు వేశారని ప్రెస్ నోట్ లో వివరణ ఇచ్చాక మౌనం వహించారు. ఉదయ నిధి స్టాలిన్, అదితి రావు హైదరి జంటగా ఆయన రూపొందించిన సైకో అక్కడ క్రిటిక్స్ తో మెప్పులు పొందింది. కానీ ఎందుకో ఇక్కడికి డబ్బింగ్ వెర్షన్ తీసుకురాలేకపోయారు. ఇళయరాజా సంగీతం సూపర్ హిట్ కూడా అయ్యింది. అది మిస్ అయ్యామే అని ఫీలవుతున్న ప్రేక్షకులకు ఊరటగా పిశాచి 2 మాత్రం తెలుగులో తేవడం శుభవార్తే. క్రైమ్ సినిమాలతోనే ఓ రేంజ్ లో భయపెట్టే మిస్కిన్ పిశాచి 2ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp