ఫిజికల్ టాస్కుల జోరు - ఆర్గుమెంట్ల తీరు

By iDream Post Oct. 17, 2020, 12:07 pm IST
ఫిజికల్ టాస్కుల జోరు - ఆర్గుమెంట్ల తీరు

ఈ రోజుతో అయిదో వారం పూర్తి చేసుకోబోతున్న బిగ్ బాస్ 4 నుంచి ఎవరు బయటికి వస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నాగార్జున ఎవరిని సాగనంపబోతున్నారనే దాని మీద సోషల్ మీడియాలో ఇంకా లీకులు షురు కాలేదు. నామినేషన్ల లిస్టు పెద్దగానే ఉన్నప్పటికీ ఎవరు టాప్ లో ఉన్నారో అంతు చిక్కడం లేదు. అందుకే నిన్న ఫిజికల్ టాస్కు విషయంలో ఎవరికి వారు గట్టిగానే పోరాడారు. మోనాల్ మళ్ళీ అఖిల్ తో రొమాన్స్ ట్రాక్ కి తెరతీసే ప్రయత్నం చేసింది. అరియానా అవినాష్ ల మధ్య పని గురించి కాసేపు హాట్ డిస్కషన్ నడిచింది. సోహైల్ ఎవరికీ కనిపించకుండా బెడ్ వెనుక పడుకోవడంతో డాగ్ బార్కింగ్ సహాయంతో నోయల్ తనని లేపి మరోసారి చేయొద్దని హెచ్చరించాడు.

ఇక రేసర్ అఫ్ ది హౌస్ అనే కొత్త టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఆడమగ తేడాలేకుండా అందరూ పుష్ అప్స్ తీయాలని ఆదేశించాడు. కానీ లేడీస్ ఫస్ట్ రౌండ్ లోనే చేతులెత్తేయగా కుమార్ సాయి, సోహైల్, నోయల్, మెహబూబ్ లు మాత్రమే అందులో నెగ్గుకురాగలిగారు. ఇక కుమార్ సాయి, నోయల్ మధ్య నిజాలు మాట్లడుకోవడం గురించి వాదోపవాదాలు జరిగాయి. మధ్యలో అమ్మ రాజశేఖర్ వచ్చినా లాభం లేకపోయింది. ఒక దశలో ఘాటైన మాటల యుద్ధం జరిగింది. దీని వంకతోనే నోయల్ మిడిల్ డ్రాప్ అయ్యాడు. వీటితో పాటు మరికొన్ని వెరైటీ టాస్కులు కూడా నడిచాయి. ఇవన్ని సరదాగానే ఉన్నాయి.

ఇసుక బస్తాలు వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో నడవడం, టైర్ల మధ్య నుంచి పాదయాత్ర చేయడం, తడిసిన చేతులతో వేలాడుతూ సాగడం లాంటి క్లిష్టమైన పనులు అప్పజెప్పాడు బిగ్ బాస్. అందరికంటే తక్కువ సమయం కేవలం 49 సెకండ్లలో వీటిని పూర్తి చేసిన మెహబూబ్ రేస్ అఫ్ ది హౌస్ గా నిలిచాడు. అతని బాడీ ఫిట్నెస్ దీనికి బాగా ఉపయోగపడింది. నైట్ అవుట్ పార్టీ పేరుతో ఇచ్చిన అవకాశాన్ని అమ్మాయిలు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అభిజిత్, అరియానా, మోనాల్ యధావిధిగా తమకు అలవాటైన రీతిలో గట్టిగానే హంగామా చేశారు. మోనాల్, అవినాష్ లు ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. అఖిల్ సైతం అదే తీరులో ఉన్నాడు. సో వీకెండ్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతోందో ఈరోజు తేలిపోతుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp