అంత సందడి ఇప్పుడు చేయగలరా

By iDream Post May. 10, 2020, 01:11 pm IST
అంత సందడి ఇప్పుడు చేయగలరా

చిన్న చిన్న వేషాలతో అప్ కమింగ్ హీరోగా నెట్టుకొస్తున్న శ్రీకాంత్ ని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసేసి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మార్చేసిన 'పెళ్లి సందడి' అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు సంగీత దర్శకుడు కీరవాణి సృష్టించిన ఈ మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ప్రతి పది నిమిషాలకో పాట వస్తూ ఫైట్స్ లేకుండా శివాజీరాజా లాంటి చిన్న ఆర్టిస్ట్ ని విలన్ గా పెట్టి టాలీవుడ్ లోని హాస్య తారాగణాన్ని తీసుకుని ఇంత సెటప్ లో ఇండస్ట్రీ హిట్ సాధించడం అంటే మాటలు కాదు.

హీరొయిన్ దీప్తి భట్నగర్ తో పాటు రవళికు కూడా గొప్ప పేరు తీసుకొచ్చిందీ సినిమా. 1996 సంక్రాంతికి వచ్చి కొన్నేళ్ల పాటు టాప్ గ్రాసర్ గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట రాఘవేంద్రరావు. దీనికి సంబంధించిన ఆలోచన చాలా సీరియస్ గా చేస్తున్నట్టు తెలిసింది. 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ మేజిక్ రిపీట్ చేయగలరా అనేదే ఇప్పుడు రేగుతున్న ప్రశ్న. అప్పటి ట్రెండ్ లో అన్నేసి పాటలు ఉన్నా కథలో ఉన్న బలం వల్ల అద్భుతమైన సంగీతం వల్ల పెళ్లి సందడి ఆ స్థాయిలో హిట్టయ్యింది కానీ కథ పరంగా మరీ అంత గొప్పగా ఏమి ఉండదు.

కేవలం తన దర్శకత్వ ప్రతిభతో రాఘవేంద్రరావు దీన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. శ్రీకాంత్ అప్పుడు ఫ్రెష్ నటుడు. ఇప్పుడు అవుట్ అఫ్ మార్కెట్ కాబట్టి ఇంకో ఆప్షన్ చూసుకోవాలి. క్యాస్టింగ్ కూడా అంతే భారీగా ఉండాలి. ఆ టైంలో చేసినవాళ్లు ఏజ్ బార్ అయిపోయారు. ఇవన్నీ ఒకరకంగా చెప్పాలంటే సవాళ్ళే. అందులోనూ క్లాసిక్ సీక్వెల్ అంటే అంచనాలు వద్దన్నా విపరీతంగా పెరిగిపోతాయి. ఇవన్నీ నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. గత కొంత కాలంగా రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. మరి పెళ్లి సందడి 2 నిజంగా ఉంటుందా లేదా అనేది కొంత కాలం వేచి చూశాక తెలుస్తుంది. ఇది తీశాకే రిటైర్ అవుతారన్న టాక్ కూడా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp