పవన్ వద్దనుకున్న కథతో గోపీచంద్ ?

By iDream Post Jan. 08, 2021, 04:23 pm IST
పవన్ వద్దనుకున్న కథతో గోపీచంద్ ?

నిన్న గోపీచంద్ మారుతీ కాంబినేషన్ లో యువి సంస్థ, గీత ఆర్ట్స్ 2 సంయుక్తంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలయ్యింది. సబ్జెక్టు సెలక్షన్ అండ్ పర్ఫెక్షన్ లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఈ కాంబోలో తమ హీరో చాలా గ్యాప్ తర్వాత హిట్టు కొడతాడన్న నమ్మకాన్ని గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలతో కూడిన ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది రీమేక్ అని చెబుతున్నారు. ఖచ్చితంగా తెలియదు కానీ విశ్వసనీయ సమాచారం మేరకు జాలీ ఎల్ఎల్బి 2 కి తెలుగు రూపకం అయ్యుండొచ్చని వినికిడి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్.

ఇది నిజమే అయితే గోపీచంద్ కి మంచి ఛాయస్ అవుతుంది. ఎందుకంటే ఆ కథలో ఎమోషన్స్, ట్విస్ట్, సెంటిమెంట్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. కాకపోతే ఊర మాస్ మసాలా కంటెంట్ ఉండదు. కానీ ఎంటర్ టైన్మెంట్ కు లోటు లేకుండా సాగుతుంది. అందులోనూ మారుతీ లాంటి దర్శకుడు ఇచ్చే టచప్, చేంజ్ వేరే ఉంటుంది. అయితే ఇప్పటిదాకా రీమేకుల జోలికి వెళ్లని మారుతీ నిజంగా దీనికి సిద్ధపడ్డారా లేక కేవలం ఇది ప్రచారంలోకి వచ్చిన న్యూసా అనేది తెలియాల్సి ఉంది. అసలే గోపీచంద్ హిట్టు కొట్టి పుష్కర కాలం అవుతోంది. సీటిమార్ తో పాటు ఈ సినిమా కూడా గట్టిగా ఆడితే మళ్ళీ రేస్ లోకి రావొచ్చు.

గతంలో జాలీ ఎల్ఎల్బి 2ని పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒకదశలో త్రివిక్రమ్ దర్శకత్వం లేదా రచనలో చేయాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే లాయర్ గా దీని కంటే తనకు పింక్ సబ్జెక్టు బాగా సూట్ అవుతుందని భావించిన పవన్ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్ తో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా జరిగాయి. అలా చాలా చక్కర్లు కొట్టి జాలీ ఎల్ఎల్బి 2 పెండింగ్ లో ఉంటూ వచ్చింది. మరి మారుతీ చేయబోయేది ఈ సినిమానా కదా అనే క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం ఆగాలి. ఇందులో కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp