పవన్ కోసం పింక్ ని మార్చేశారా

By Ravindra Siraj Jan. 21, 2020, 12:54 pm IST
పవన్ కోసం పింక్ ని మార్చేశారా

జనసేన స్థాపించాక ఇకపై పూర్తి స్థాయి రాజకీయాలకు అంకితం అవుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ మాట మీద రెండేళ్లు కూడా నిలవకుండానే షూటింగ్ కు వచ్చేశాడు. ఈ రోజు నుంచి హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన కోర్ట్ సెట్ లో చిత్రీకరణ ప్రారంభమయ్యింది. అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అయినప్పటికీ ఇలా మేకప్ వేసుకున్నాక పొలిటికల్ జర్నీ మీద పవన్ ఎంత వరకు ఫోకస్ పెట్టగలడు అనే దాని మీద అనుమానాలు లేకపోలేదు.

ఇకపోతే ఇది పింక్ అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ ఇప్పటికే దీన్ని తమిళ్ లో తీసేశాడు. తల అజిత్ హీరోగా రూపొందిన ఈ మూవీ అక్కడ మరీ అద్భుతాలు చేయలేదు కానీ డీసెంట్ రన్ తెచ్చుకుని పెట్టుబడి పరంగా లాభాలు ఇచ్చింది. ఒరిజినల్ వెర్షన్ ని మక్కికి మక్కి తీయకుండా హీరోకు చిన్న ఫ్లాష్ బ్యాక్ తో పాటు ఓ వ్యాధిని జోడించి మసాలా అద్దారు. ఇది కొంతవరకు వర్క్ అవుట్ అయ్యింది కూడా. 

Read Also: జగన్ అద్భుత పాలన - పవన్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

కానీ కంబ్యాక్ మూవీగా పవన్ దీన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఇంత సీరియస్ కోర్ట్ డ్రామా ఏ మేరకు మెప్పిస్తుందన్నది వేచి చూడాలి. పైగా అభిమానుల కోసం అన్నట్టుగా ఓ రెండు పాటలు కూడా జోడిస్తున్నారట. పవన్ సరసన నటించేందుకు టాప్ ఫామ్ లో ఉన్న ఓ హీరోయిన్ తో మంతనాలు జరుగుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.

ఒకవేళ అదే నిజమైతే పింక్ లోని ఒరిజినల్ ఫ్లేవర్ ఇందులో ఖచ్చితంగా తగ్గుతుంది. అందులోనూ రెండేళ్ల గ్యాప్ తర్వాత మూవీ కాబట్టి ఫ్యాన్స్ అంచనాలు కూడా భారీగా ఉంటాయి. ఇలాంటి సబ్జెక్టుతో వాటిని అందుకోవడం అంత సులభం కాదు. పైగా దీని తర్వాత కూడా పవన్ సినిమాలు కొనసాగిస్తాడనే వార్త జనసేన మనుగడకు ప్రశ్నగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పుడీ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అధికారికంగా ధృవీకరించలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp