ఇటు పవన్ అటు అఖిల్

By iDream Post Aug. 13, 2020, 02:00 pm IST
ఇటు పవన్ అటు అఖిల్

హఠాత్తుగా నిన్నటి నుంచి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 29వ సినిమా ఉంటుందన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే పవర్ స్టార్ మూడు కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ అవ్వగానే క్రిష్ ప్రాజెక్ట్ లో చేరాలి. అది పూర్తి కాగానే హరీష్ శంకర్ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఎదురు చూస్తుంటాడు. ఆ తర్వాతే సూరికి ఛాన్స్ ఉండొచ్చు. అయితే దీనికి ఎంతలేదన్నా ఏడాదిన్నర నుంచి రెండేళ్ళు పడుతుంది. అప్పటిదాకా సూరి వేచి చూస్తాడా అనేది అనుమానమే. అయితే ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ సినిమా పక్కానేనట. నిర్మాత రాం తాళ్లూరి ఇచ్చిన అడ్వాన్సు పవన్ దగ్గర ఎప్పటి నుంచో ఉంది.

అప్పట్లోనే చేస్తానని మాట కూడా ఇచ్చాడట. ఆ కారణంగానే టైట్ షెడ్యూల్ లోనూ నేల టికెట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ గెస్ట్ గా వచ్చాడు. ఇప్పుడు రీ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది కాబట్టి సినిమా రూపొందించే దిశగా చర్చలు ఫైనల్ అయినట్టుగా తెలిసింది. అయితే దీనికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆలోగా సురేందర్ రెడ్డి అఖిల్ తో చేయాలనుకున్న మూవీని పూర్తి చేయొచ్చు. ఎలాగూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ ఇంకా ఏదీ డిసైడ్ కాలేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చి ఉంటే ఈజీగా ఆరేడు నెలల్లో సినిమాను పూర్తి చేయొచ్చు. పవన్ ఫ్రీ అయ్యేనాటికి ఇది విడుదల అయ్యి ఉంటుంది. దర్శకుడు తేజ కూడా అఖిల్ కోసం ఓ కథను సిద్ధం చేసినట్టు మరో టాక్ ఉంది.

ఇప్పటికే ఓవర్ సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేసి దెబ్బ తిన్న అఖిల్ కు జయం, నువ్వు నేను టైప్ లో మసాలా అంశాలు ఉన్న సబ్జెక్టు పడి హిట్టు కొడితే ఫలితం ఇంకో రేంజ్ లో ఉంటుంది. అయితే తేజ గోపీచంద్ తో అలివేలు వెంకటరమణ ప్లానింగ్ లో ఉన్నాడు. సో ఇప్పటికిప్పుడు ఏమి చెప్పలేం. సో బాల్ ఇప్పుడు సురేందర్ రెడ్డి కోర్టులో ఉన్నట్టు కనపడుతోంది. సరైన ప్లానింగ్ తో చేసుకుంటే రెండూ పూర్తి చేసుకోవచ్చు. సైరా తర్వాత గ్యాప్ తీసుకున్న సూరి విదేశాల్లో ఉన్నప్పటికీ కథలు సిద్ధం చేసుకుని కొన్ని ఫైనల్ వెర్షన్లు రాయించేశాడట . హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మీడియాకు కూడా సురేందర్ రెడ్డి అందుబాటులో లేరు. మిగిలిన దర్శకులు ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నారు కానీ ఇతను మాత్రం బొత్తిగా నల్లపూస అయిపోయారు. సో ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఒకటే. సురేందర్ రెడ్డి చేయబోయే సినిమాల ఆర్డర్ లో పవన్ ముందు వస్తారా లేదా అఖిల్ మూవీ ఫస్ట్ వస్తుందా అని. దీనికి కాలమే సమాధానం చెప్పాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp