బాలీవుడ్ లో మన హీరోల జెండాలు

By iDream Post Jan. 22, 2021, 12:58 pm IST
బాలీవుడ్ లో మన హీరోల జెండాలు

ఇక్కడ ఎంత స్టార్ డం వచ్చినా బాలీవుడ్ లోనూ మన పాపులారిటీ పెరిగితే వచ్చే కిక్కే వేరు. దాన్ని ప్రభాస్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాహుబలితో మొదలుపెట్టి ఆది పురుష్ దాకా తన సత్తా ఏంటో అక్కడి ఖాన్లు సైతం ఆలోచించే స్థాయికి చేరుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా లైగర్ తో పాగా వేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కరణ్ జోహార్ నిర్మాత కావడంతో మంచి స్ట్రాటజీలే ఉండబోతున్నాయి. అయితే గతంలో మన తెలుగు అగ్రనటులు అక్కడ జెండా పాతాలని ట్రై చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ మరీ తీవ్రంగా ప్రభావితం చేసినవాళ్లు మాత్రం తక్కువే. రెండు మూడు సినిమాలు చేసి ఆపేసిన బాపతే అంతా. ఓ లుక్ వేద్దాం.

స్వర్గీయ నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లు ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నించలేదు కానీ ఆ తర్వాత తరం మాత్రం దీన్ని కాస్త సీరియస్ గానే తీసుకుంది. చిరంజీవి ప్రతిబంధ్, ఆజ్ కా గూండారాజ్, ది జెంటిల్ మెన్ లు చేసి రెండు విజయాలు ఒక డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత మానుకున్నారు. వెంకటేష్ ఆనారితో సక్సెస్ కొట్టి యమలీల రీమేక్ తక్దీర్ వాలాతో పంచ్ తిని మళ్ళీ ఆ ప్రయత్నం చేయలేదు. బాలకృష్ణ అసలు ఆ వైపు కూడా ఆలోచించలేదు. నాగార్జున మాత్రం ఈ విషయంలో అందరి కన్నా స్పెషల్. శివతో మొదలుపెట్టి బ్రహ్మాస్త్ర దాకా హిందీ స్ట్రెయిట్ సినిమాల్లో అడపాదడపా చేస్తూనే ఉన్నారు.

కాకపోతే నాగ్ చేసినవాటిలో అన్నీ సోలో హీరోలు కావు. స్పెషల్ క్యామియోలు ఎక్కువ. రజనీకాంత్, కమల్ హాసన్ లు సైతం ఒక దశలో కొన్ని చేసి వాళ్ళూ పూర్తిగా తమిళంకి అంకితమైపోయారు. ఎంత హిందీ మోజున్నా ఇక్కడ దక్కే పాపులారిటీతో పోలిస్తే నార్త్ లో వచ్చేది తక్కువే. ప్రభాస్ సైతం ఇంకో రెండు మూడు ఏళ్ళు ఆగితే కానీ నేషనల్ లెవెల్ లో ఏ స్థాయిలో సెటిల్ అవుతాడనే క్లారిటీ రాదు. పొరుగింటి పుల్లకూర రుచి తరహాలో కన్నడ స్టార్లు మన తెలుగులో విలన్ వేషాలు వేసి పేరు తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకుని మిడిల్ రేంజ్ హీరోలందరూ పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp