షాక్ ఇస్తున్న OTT సర్వేలు

By iDream Post Jul. 13, 2020, 02:26 pm IST
షాక్ ఇస్తున్న OTT సర్వేలు

చాప కింద నీరులా ఓటిటి తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. మొదట్లో కొందరు దీన్ని లైట్ గా తీసుకున్నా థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో జనం వీటికి అలవాటు పడటం అంతకంతా పెరుగుతూ పోతోంది. దానికి తోడు ఒకదాన్ని మించి మరొకటి అలరించే వెబ్ సిరీస్ లు వస్తుండటంతో భాషతో సంబంధం లేకుండా ఆదరణ బాగా పెరుగుతోంది. ఇప్పటికి నాలుగు నెలలుగా సినిమా హాళ్లు మూసి ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ ఒక్క రంగాన్ని పట్టించుకునే స్థితిలో లేవు. ఇదే ఆందోళన కలిగించే అంశం అనుకుంటే తాజాగా వెలువడుతున్న ఓటిటి సర్వేలు టెన్షన్ ని ఇంకాస్త పెంచేలా ఉన్నాయి.

ముంబైకి చేసిన ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ప్రతి నలుగురిలో ముగ్గురు తాము ఇంట్లో ఉండే సినిమాలు చూసేందుకు ఇష్టపడతామని చెప్పారట. అయితే అందులో 54 శాతం దాకా మల్టీ ప్లెక్సులో కూర్చుని పాప్ కార్న్, కూల్ డ్రింక్ త్రాగుతూ ఎంజాయ్ చేయడమే నచ్చుతుందని చెప్పగా మిగిలిన 44 శాతం స్టే సేఫ్ హోమ్ మంత్రాన్ని పఠిస్తున్నారు. ఇక ఇతర విషయాలకు వస్తే టికెట్ మరియు ఆహరం ధరల విషయంలో 71 శాతం అసంతృప్తిని వ్యక్తం చేయగా 27 శాతం తమకేమి భారం కాదని తేల్చి చెప్పారు. ఇక ఆర్థిక స్థోమత బాగున్న ప్రేక్షకుల్లో 72 శాతం తాము పెద్ద ఇంచుల కలర్ టీవీ కొనుక్కుని హోమ్ థియేటర్ సెట్ చేసుకుని నేరుగా డిజిటల్ రిలీజులు ఎంజాయ్ చేస్తాం తప్ప ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియని థియేటర్లో కాలు పెట్టే సాహసం ఇప్పట్లో చేయలేమని చెబుతున్నారు.

మిగిలినవాళ్లు మాత్రం స్టార్ క్యాస్టింగ్, డైరెక్టర్ బ్రాండ్ లాంటి అంశాలు చెక్ చేసుకుంటాం తప్ప వచ్చిన ప్రతి సినిమాను చూసే సీన్ లేదని ఫిక్స్ అయ్యారు. ఈ గణాంకాలన్నీ చూస్తే ఓటిటి విస్తృతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అందులోనూ డిస్నీ హాట్ స్టార్ లాంటి సంస్థలు ఏకంగా 10కి పైగా క్రేజీ బాలీవుడ్ సినిమాలను స్ట్రెయిట్ రిలీజ్ చేయబోతుండటం వాతావరణాన్ని వేడెక్కించింది. సౌత్ విషయానికి వస్తే పెంగ్విన్ తప్ప అన్నీ చిన్న బడ్జెట్ సినిమాలే ఓటిటిలో వచ్చాయి. ఏదైనా స్టార్ మూవీ వస్తే అప్పుడు లెక్కలు మారే ఆవకాశం లేకపోలేదు. ప్రతి శుక్రవారం కొత్త సినిమా చూడకపోతే ఏదో వెలితిగా ఫీలయ్యే మూవీ లవర్స్ కు ఈ పరిణామాలు నిరాశ కలిగించేవే. పెద్ద తెరపై వినోదాన్ని అందుకోవాలని ఎదురు చూసే ప్రేక్షకులు కోట్లలో ఉండగా వైరస్ ప్రకంపనలు మాత్రం వాళ్లకు అడ్డుగోడగా నిలుస్తున్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp