ఆ మేజిక్ ఇళయరాజాకే సాధ్యం - Nostalgia

By Ravindra Siraj Feb. 23, 2020, 11:15 am IST
ఆ మేజిక్ ఇళయరాజాకే సాధ్యం - Nostalgia

ఓ ఇరవై ఏళ్ళ క్రితం యువకుడిగా ఉన్న వ్యక్తయినా లేదా ఇప్పుడు వయసులోకి వచ్చిన న్యూ జనరేషన్ బాయ్ అయినా ఏ తేడా లేకుండా ఆయన సంగీతం అంటే తమను తాము మర్చిపోతారు. తమిళం కన్నడ మలయాళం హిందీ తెలుగు ఏదైనా, హీరో ఎవరైనా తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో కంపోజింగ్ తో మెస్మరైజ్ చేయడంలో ఇళయరాజాకు సాటివచ్చే వారు ఎవరూ లేరు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కానీ మచ్చుకు ఒకటి చూద్దాం.

మాములుగా ఒక భాషలో వాడిన ట్యూన్ కానీ పాటను కానీ ఇంకో భాషలో రీ కంపోజ్ చేస్తే తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎంత గొప్ప గీత రచయిత రాసినా ఒరిజినల్ ఫీల్ కలగడం అంత సులభం కాదు. కానీ రాజా అలా కాదు. మైమరిపించి మురిపించేస్తారు. అందుకే వెయ్యి సినిమాల ప్రయాణం పూర్తి చేసినా ఆ స్వరఝరికి అలుపు రాదు. చాలాసార్లు మ్యూజిక్ లవర్స్ రాజా రెండు వెర్షన్ల పాటలు విన్నప్పుడు ఏది ముందు వచ్చిందో చెప్పడం అసాధ్యం అనే రీతిలో ఉంటాయి ఆ స్వరమదురిమలు.

1991లో రజనీకాంత్ హీరోగా ధర్మ దురై అనే సినిమా వచ్చింది. స్వార్థం నిండిన తమ్ముళ్ళంటే పడిచచ్చే అమాయకపు అన్నయ్య పాత్రలో రజని విశ్వరూపానికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇళయరాజా సంగీతమూ వాడవాడలా మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా "మాసి మాసం ఆలన పొన్న" అనే మెలోడీ అయితే టేప్ రికార్డర్ అరిగిపోయేదాకా వినేవాళ్ళు జనం. తమిళ్ లో జేసుదాస్, స్వర్ణలతల గాత్రంలో ఆ మెలోడీ అద్భుతం అనిపించేలా నిలిచిపోయింది.

ఆ తర్వాత కొన్ని నెలలకు బాలకృష్ణ ధర్మక్షేత్రం సినిమా కోసం ఇదే ట్యూన్ ని వేటూరి సాహిత్యంతో ఇచ్చారు రాజా. ఒరిజినల్ వెర్షన్ ను తలదన్నేలా ఎస్పి బాలసుబ్రమణ్యం, చిత్రల వాయిస్ లో "ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదీ వెన్నెలమ్మ" పాట ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ధర్మక్షేత్రం ఫ్లాప్ అయినా ఇందులో పాటలు మాత్రం ఎవర్ గ్రీన్ అయ్యాయి. 2013లో అమెరికాలో జరిగిన లైవ్ కాన్సర్ట్ లో బాలు, చిత్రలు ఇదే పాటను మళ్ళీ పాడినప్పుడు స్టేడియం తన్మయత్వంతో ఊగిపోయింది. కావాలంటే మీరే చూడండి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp