వెబ్ సిరీస్ కోసం ఆఫీస్ సెలవు

By iDream Post Aug. 31, 2021, 10:30 am IST
వెబ్ సిరీస్ కోసం ఆఫీస్ సెలవు

స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు చిన్నా పెద్ద తేడా లేకుండా ఆయా అభిమానులు మొదటి రోజే చూడాలని తహతహలాడటం సహజం. ఆ రోజు మిస్ అయితే జీవితంలో ఏదో కోల్పోతామన్న తరహాలో టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు మాములుగా ఉండవు. గతంలో రజినీకాంత్ రోబో, శివాజీ లాంటి చిత్రాలు వచ్చినప్పుడు కొన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ఉద్యోగులకు సెలవు ఇవ్వడమే కాక టికెట్లు కూడా స్పాన్సర్ చేయడం అప్పట్లో మీడియాలో బాగా హై లైట్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి వాళ్ళ మూవీస్ వస్తే మన ఫ్యాన్స్ చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక విషయానికి వద్దాం.

ఇలాంటి క్రేజ్ కేవలం సినిమాలకు మాత్రమే ఉందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వెబ్ సిరీస్ ల కోసం కూడా ఇదే స్థాయిలో అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. దానికి ఉదాహరణగా నిలుస్తోంది మనీ హీస్ట్. ఓ దొంగ ముఠా పట్టపగలే ఓ బ్యాంకుకు వెళ్లి బయట వందలాది పోలీసులు ఉన్నా కోట్ల రూపాయల డబ్బును దోచుకోవడానికి వేసే ప్లానే ఇందులో అసలు కథ. ఎవరికీ కనిపించని ఒక ప్రొఫెసర్ కేవలం ఫోన్ కాల్స్ ద్వారా ఇంత పెద్ద ఆపరేషన్ ని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా ఇది నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఫైనల్ సిరీస్ లో మొదటి ఐదు ఎపిసోడ్లు సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

దీన్ని పురస్కరించుకుని వెర్వే లాజిక్ అనే భారతీయ సంస్థ తమ ఉద్యోగులకు హాలిడే ఇచ్చేసింది. దొంగ సాకులుతో తమ మెయిల్ బాక్స్ నిండిపోవడం ఇష్టం లేదని అందుకే ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి మనీ హీస్ట్ ని ఎంజాయ్ చేయమని అధికారికంగా ఇచ్చిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెట్ ఫ్లిక్స్ అండ్ ఛిల్ హాలిడే అని పేరు పెట్టడం విశేషం. సంస్థ అధినేత అభిషేక్ జైన్ దీన్ని జారీ చేశారు. ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే సౌకర్యం ఉన్న వెబ్ సిరీస్ కోసం ఇలా ఇండియన్ కార్పొరేట్ కంపెనీలు సెలవు ఇవ్వడం అనేది మాత్రం చాలా అరుదైన సంఘటన. వచ్చాక ఇది ఎన్ని సంచలనాలు రేపుతుందో

Also Read : ఇలాంటి కలెక్షన్లతో మళ్ళీ మూయాల్సిందే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp