నాని 27 నెంబర్ ఛేంజ్ ?

By iDream Post May. 23, 2020, 11:25 am IST
నాని 27 నెంబర్ ఛేంజ్ ?

సినిమా పరిశ్రమ మీద పలు రకాలుగా ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ పీడ ఇంకా పూర్తిగా వదలడం లేదు. షరతులతో కూడిన అనుమతితో రేపో ఎల్లుండో షూటింగులకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇవ్వబోతున్నాయి కాని అందులో ఏమేం ఉంటాయో అన్న సస్పెన్స్ అందరిలోనూ ఉంది. దీని సంగతలా ఉంచితే పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు తమ షెడ్యూల్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. ఇక్కడే గ్రీన్ మ్యాట్లు వేసుకుని గ్రాఫిక్స్ చేయించుకునే స్తోమత లేని నిర్మాతలకు ఇదో తీవ్రమైన సమస్యగా మారనుంది.

ఇందులో నాని 27వ చిత్రం 'శ్యాంసింగరాయ్' కూడా ఉన్నట్టు సమాచారం. కథ ప్రకారం ఈ మూవీ అధిక శాతం కోల్కతాలో జరుగుతుందట. కొన్ని ఫారిన్ లొకేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటే వీలు లేదు.అందులోనూ విదేశాలకు వెళ్ళే ఛాన్స్ అసలు లేదు. స్టొరీని మార్చే అవకాశం లేకపోవడంతో దీన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టేసి దాని స్థానంలో శ్రీకాంత్ ఓడెల అనే కొత్త దర్శకుడి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్టు సమాచారం. అయితే ఇదంతా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయ్ దేవరకొండతో టాక్సీ వాలాతో ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రాహుల్ సంకృత్యాన్ ని శ్యాం సింగ రాయ్ కి సెట్ చేసుకున్నారు.

కాని ఇప్పుడీ అవాంతరం వల్ల అతను ఇంకొంత కాలం స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తాడో లేక ఇంకో హీరోతో వేరే సినిమా చేస్తాడో వేచి చూడాలి. తుపాను భీభత్సం వల్ల కోల్కత దారుణంగా దెబ్బ తింది. కోలుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఇన్ని అవాంతరాల మధ్య షూటింగ్ ని కొనసాగించడం కష్టమే. ప్రస్తుతం శివ నిర్వాణతో టక్ జగదీశ్ షూటింగ్ ని పూర్తి చేసే టార్గెట్ తో ఉన్న నాని డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ లో ఉన్నాడట. ఇప్పుడు ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో థియేటర్లు తెరుచుకున్నాక గాని స్పష్టత రాదు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు రాగానే వెంటనే షూటింగులు మొదలుపెట్టుకోవాల్సిన వాటిలో టక్ జగదీశ్ ముందుంది. పైన టాక్ ప్రకారం చూసుకుంటే నాని 27 నెంబర్ 28 లేదా 29 అయ్యేలా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp