కుమార్‌ సాయిని కెలికేసిన నోయెల్‌!

By Satya Cine Sep. 15, 2020, 12:58 pm IST
కుమార్‌ సాయిని కెలికేసిన నోయెల్‌!
బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన కుమార్‌ సాయి, వస్తూనే సెగ రేపేశాడు. తాను హౌస్‌లోకి రహస్యంగా ఎంట్రీ ఇచ్చి, అందర్నీ బకరాల్ని చేద్దామనుకున్నాడుగానీ, ఎవరూ అతన్ని సీరియస్‌గా తీసుకోలేదు. తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో హౌస్‌లోకి వచ్చి, దుప్పటి ముసుగేసుకున్న కుమార్‌ సాయిని తొలుత దేవి గుర్తించింది. ‘ముసుగు తొలగిస్తే డైరెక్ట్‌ ఎలిమినేషన్‌’ అని కుమార్‌ సాయి చెప్పినా, దేవి లెక్క చేయలేదు. ఆ తర్వాత ఒకరొకరుగా వచ్చారు, అందర్నీ ఆటపట్టిద్దామనుకున్నా.. చేదు అనుభవమే ఎదురయ్యింది కుమార్‌ సాయికి. ఇదిలా వుంటే, ఎలిమినేషన్‌ కోసం జరిగిన నామినేషన్‌ టాస్క్‌ సందర్భంగా పడవ నుంచి ముందు ఎవరు దిగాలి? అన్న చర్చ జరిగినప్పుడు, నోయెల్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చావు కదా, నువ్వే ముందు దిగమని చెప్పాడు. కానీ, అందుకు ‘సరైన కారణం’ మీరంతా చెప్పాలంటూ కుమార్‌ సాయి కండిషన్‌ పెట్టాడు. ‘నన్ను దిగిపొమ్మని మీరు చెప్పెయ్యండి.. నేను దిగిపోతా..’ అని అన్నాడు. దీనిపై నోయెల్‌ ఒకింత నొచ్చుకున్నాడు. మాటల యుద్ధం ఓ మోస్తరుగా జరిగాక, గంగవ్వ, కరాటే కళ్యాణి, నోయెల్‌, హారిక.. ఇలా ఒకరొకరుగా పడవ దిగేసి, నామినేట్‌ అయ్యారు ఎలిమినేషన్‌ కోసం. ఇతర సభ్యుల కోరిక మేరకు కుమార్‌ సాయి కూడా పడవ దిగేశాడు. ఆ పనేదో వాగ్యుద్ధం లేకుండా చేసి వుంటే బావుండేదేమో. ఇది నోయెల్‌కి కోపం తెప్పించింది. కుమార్‌ సాయి మీద ఇతర కంటెస్టెంట్స్‌ వద్ద నోయెల్‌ కాస్త గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఇది కుమార్‌ సాయికి ఎమోషనల్‌గా వర్కవుట్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వస్తూనే ఎలిమినేషన్‌ కోసం కుమార్‌ సాయి నామినేట్‌ అవడం గమనార్హం.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp