ఈ వారం కూడా థియేటర్ VS ఓటిటి

By iDream Post Sep. 21, 2021, 04:30 pm IST
ఈ వారం కూడా థియేటర్ VS ఓటిటి

కరోనా దెబ్బకు వారం వారం కొత్త సినిమాల రిలీజులంటే అటు థియేటర్లతో పాటు ఇటు ఓటిటి లిస్టు కూడా చెక్ చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే రెండూ సమాంతరంగా పోటీ పడే పరిస్థితి వచ్చేసింది. 10వ తేదీ సీటిమార్ తో టక్ జగదీష్ తలపడగా 17న గల్లీ రౌడీతో మాస్ట్రో ఢీ కొట్టాడు. ఫలితాల సంగతి ఎలా ఉన్నా మూవీ లవర్స్ కి మాత్రం డబుల్ ఎంటర్ టైన్మెంట్ దొరుకుతోంది. ఈ నేపథ్యంలో మరో శుక్రవారం వచ్చేస్తోంది. 24న అందరి చూపు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మీదే ఉంది కానీ పోటీకి సై అని వేరే సినిమాలు కూడా వస్తున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లోనూ సందడి ఉండబోతోంది. సో వినోదానికి ఈ వారం కూడా లోటు లేదన్న మాట.

లక్ష్మి రాయ్ నటించిన డబ్బింగ్ మూవీ సిండరిల్లా థియేటర్లకే వస్తోంది. హారర్ జానర్ అయినప్పటికీ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. తనీష్ నటించిన మహా ప్రస్థానం సింగల్ షాట్ మూవీగా ప్రమోట్ చేస్తూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా బిగ్ స్క్రీన్స్ మీదే రాబోతోంది. ఇక ఓటిటిల విషయానికి వస్తే రాజమౌళి కాంపౌండ్ నుంచి వచ్చిన యూత్ టీమ్ రూపొందించిన ఆకాశవాణి అదే రోజు సోని లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రైలర్ చూశాక ఇదేదో చాలా డిఫరెంట్ మూవీగా ఉండబోతోందన్న ఐడియా వచ్చేసింది. దుల్కర్ సల్మాన్ పరిణయం అనే డబ్బింగ్ సినిమా ఆహా యాప్ అదే 24న స్ట్రీమింగ్ చేయబోతోంది.

ఇవి కాకుండా హాలీవుడ్ మూవీస్ జంగల్ క్రూజ్, పామ్ స్ప్రింగ్స్ కూడా తెలుగు అనువాద రూపాలతో సహా రాబోతున్నాయి. వీటి ప్రభావం మరీ భారీగా ఉంటుందని చెప్పడానికి లేదు. ఓటిటి కాబట్టి ఆకాశవాణి, పరిణయం వ్యూస్ విషయంలో పెద్ద టెన్షన్ ఉండదు కానీ లవ్ స్టోరీని తట్టుకుని వస్తున్న మిగిలినవి మాత్రం కష్టపడాల్సి ఉంటుంది. నాగ చైతన్య సాయిపల్లవిల కాంబినేషన్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓ రేంజ్ లో పరుగులు పెట్టిస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు భారీగా ఉండబోతున్నాయి. అక్టోబర్ నుంచి పెద్ద సినిమాలు క్యూ కడుతున్న నేపథ్యంలో లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఏ మేరకు టర్న్ అవుతారన్నది కీలకంగా మారుతోంది

Also Read : శంకర్ సినిమాలో టెర్రిఫిక్ ఎపిసోడ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp