బిగ్ బాస్ రాజీ పడక తప్పదా ?

By iDream Post Jul. 12, 2020, 07:49 pm IST
బిగ్ బాస్ రాజీ పడక తప్పదా ?

ఒకవైపు కరోనా ఉధృతి హైదరాబాద్ లో ఎంతకీ తగ్గడం లేదు. కేసులు పూర్తిగా కంట్రోల్ కావడం ఇప్పట్లో జరిగేలా లేదు. కనీసం మరో నెలా రెండు నెలల దాకా తట్టుకోవడం తప్పదు. మరోవైపు టీవీ సీరియల్స్ షూటింగులు జరిగిపోతున్నాయి. సినిమా తారలు మాత్రం సాహసం చేయలేకపోతున్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలు జరుగుతున్నాయి కానీ స్టార్లు సెట్ కు వస్తే వచ్చే కిక్కే వేరు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 మొదలుపెట్టే ఆలోచనలో స్టార్ మా బలంగా ఉంది. ఎలాగూ థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు కాబట్టి త్వరగా మొదలుపెడితే మంచి స్పందన దక్కొచ్చనే అంచనాలో ఉంది. అయితే యాంకర్ గా ఎవరు వస్తారనేదే పెద్ద భేతాళ ప్రశ్న.

నాగార్జున ఇప్పుడు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదట. నాలుగు నెలలుగా షెడ్యూల్స్ ఆగిపోవడంతో తాను పూర్తి చేయాల్సిన సినిమాల పనులే చాలా ఉన్నాయి. ఇప్పుడు రిస్క్ తీసుకుని టీవీ షో చేసే సీన్ లేదు. నాని, జూనియర్ ఎన్టీఆర్ గతంలో తాము చేయమని చెప్పేశారు. ఒకదశలో రమ్యకృష్ణను అనుకున్నారు కానీ రెమ్యునరేషన్ విషయంలోనో లేక మరేదో కారణం వల్లనో ఆ ప్రపోజల్ కూడా డ్రాప్ అయ్యారట. ఫైనల్ గా ఇప్పుడు టీవీ యాంకర్స్ నే సెట్ చేసే ప్లానింగ్ జరుగుతోందని వినికిడి. రవి-లాస్య లేదా ప్రదీప్-అనసూయ లేదా శ్రీముఖి-సుధీర్ ఇలా మేల్ ఫీమేల్ కాంబోని పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన మీద చర్చలు జరుగుతున్నాయట. అయితే వీళ్ళలో ఎవరు చేసినా స్టార్ గ్లామర్ అయితే ఖచ్చితంగా షోకు రాదు.

ఎంత యాక్టివ్ గా చేసినా గత మూడు సీజన్లతో పోలిక వస్తుంది. అయినా మేనేజ్ చేయొచ్చు కానీ దీని వెనుక ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టిసిపెంట్స్ వేట జరుగుతోందట. భారీ ఆఫర్స్ ఇచ్చి మరీ క్రేజీ క్యాస్టింగ్ ని తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఇదంతా ఒక కొలిక్కి రావడానికి ఇంకా టైం అయితే పడుతోంది. హిందీ, తమిళ్ లాగా ఇక్కడ స్టాండర్డ్ గా ఒకే యాంకర్ తో చేసే అవకాశం లేకుండా పోతోంది. ప్రతి సీజన్ కి ఈ సెట్టింగ్ ప్రహసనంగా మారిపోయింది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అప్ డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp