మలుపులు తిరుగుతున్న సుశాంత్ కథ

By iDream Post Aug. 02, 2020, 03:33 pm IST
మలుపులు తిరుగుతున్న సుశాంత్ కథ

అనూహ్య పరిస్థితిలో ప్రాణాలు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఉదంతం సమిసిపోలేదు. రోజుకో మలుపు తీసుకుంటూ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ని మించిన సస్పెన్స్ ని రేపుతోంది. ఇటీవలే సుశాంత్ తండ్రి హీరోయిన్ రియా చక్రవర్తి మీద ఫిర్యాదు చేస్తూ 15 కోట్ల దాకా తన కొడుకు డబ్బుని ఆమె తమ్ముడు కలిసి కాజేశారని పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణ కోసం వెళ్లిన బీహార్ పోలీసులకు రియా దొరకలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా సుశాంత్ బాడీ గార్డ్ కూడా నోరు విప్పాడు. ముంబై మీడియా కథనం ప్రకారం అతని చెప్పిన వివరాలు ఇంకా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

సుశాంత్ కు ఆరోగ్యం బాలేనప్పుడు కూడా రియా తన ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ చేసుకునేదని, తన బాయ్ ఫ్రెండ్ ఏ స్థితిలో ఉన్నాడో కూడా పట్టించుకునే స్టేజిలో ఉండేది కాదని, తను వచ్చాకే సుశాంత్ కు సంబంధించిన బంధువులు, మిత్రుల రాకపోకలు తగ్గాయని చెప్పుకొచ్చాడు. తన హీరో పూర్తిగా రియా ఆధీనంలో ఉన్నాడనిపించేలా ఆమె ప్రవర్తన ఉండేదని వివరించాడు. సహజంగా దుబారా ఖర్చు చేయకుండా పొదుపుగా ఉండే సుశాంత్ కెరీర్ ప్రారంభంలో ఆటోలు క్యాబుల్లోనూ తిరగాడని కానీ రియా మాత్రం కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కారులలో తప్ప ఎక్కడికి వెళ్ళేది కాదని అన్నాడు. ఇప్పుడీ స్టేట్ మెంట్ కేసును మరో మలుపు తిప్పేలా అయింది. సోషల్ మీడియాలో సుశాంత్ ఫ్యాన్స్ ఈ పరిణామాల పట్ల అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

అన్యాయంగా మంచి భవిష్యత్తు ఉన్న ఓ హీరో జీవితాన్ని నాశనం చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా నిజమా కాదా అని తేలడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఈలోగా చాలా పరిణామాలు జరిగిపోవచ్చు. అయినా బాలీవుడ్లో మూడు దశాబ్దాల క్రితం ఆత్మహత్య చేసుకున్న దివ్యభారతితో మొదలుకుని ఇప్పటి సుశాంత్ సింగ్ రాజ్ పూత్ దాకా ఇలాంటి ఎన్నో సంఘటనల్లో అసలు నిజాలు, దోషులు బయటికి రాలేదు రానివ్వలేదు. వీటి గురించి జనం కొన్నేళ్ళు మాట్లాడుకోవడం మర్చిపోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మీడియా ఇంత విస్తృతంగా ఉంది కాబట్టి ఈమాత్రం కదలలికైనా కనిపిస్తోంది. మరి ఈ కథ ఏ కంచికి చేరుతుందో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp