Aryan Khan : ఖాన్ వారసుడి డ్రగ్ కేసులో కొత్త మలుపు

By iDream Post Oct. 21, 2021, 04:30 pm IST
Aryan Khan : ఖాన్ వారసుడి డ్రగ్ కేసులో కొత్త మలుపు

డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బెయిలు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆర్యన్ ఖాన్ కు టైం మరీ బ్యాడ్ గా ఉంది. అతనికి డ్రగ్ డీలింగ్ తో సంబంధం ఉన్నట్టుగా చూపించే వాట్సాప్ ఆధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో మరోసారి పిటీషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇవాళ కొడుకుని షారుఖ్ కారాగారంలో కలుసుకున్నాడు. నాలుగు ఓదార్పు మాటలు చెప్పి బయటికి వచ్చాడు. ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ లైగర్ తో టాలీవుడ్ కు పరిచయమవుతున్న హీరోయిన్ అనన్య పాండేకు ఈ కేసు తాలూకు సెగలు తగిలాయి. ఎన్సిబి అధికారులు ఈ రోజు ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. ఆ సమయంలో తండ్రి చుంకీ పాండే అక్కడే ఉండటం గమనార్హం.

ఇక్కడితో కథ అయిపోలేదు. విచారణకు రమ్మని ఆమెకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ఆర్యన్ లాగా తనను కస్టడీలోకి తీసుకోక పోవచ్చు కానీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో కేవలం అనన్య మీదే ఎందుకు అనుమానం వచ్చిందనే తరహాలో ఇప్పుడు ముంబై మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అనన్య ఆర్యన్ రెండు మూడేళ్ళ నుంచి మంచి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య డ్రగ్స్ కు సంబంధించి ఏమైనా లావాదేవీలు జరిగాయా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరగనుంది. ఇదే సమయంలో షారుఖ్ ఇల్లు మన్నత్ లో కూడా సోదాలు చేశారని మరో న్యూస్. ఏమైనా దొరికాయా లేదా అనే క్లారిటీ ఇంకా రావాలి.

మొదట్లో ఆర్యన్ అమాయకుడనే తరహాలో మద్దతు ఇచ్చి సోషల్ మీడియాలో క్యాంపైన్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు ఇప్పుడు గప్ చుప్ అయ్యారు. సపోర్ట్ చేస్తే ఎక్కడ లేనిపోని ఇబ్బందులు ఫేస్ చేయాలో అని ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా సల్మాన్ ఖాన్, ప్రీతీ జింటా లాంటి కొందరు ప్రముఖులు షారుఖ్ ని వ్యక్తిగతంగా పరామర్శించారు. ఆర్యన్ ఖాన్ ఈ రోజు కాకపోయినా రేపో ఎల్లుండో బయటికి రావడం ఖాయమే కానీ అసలు హీరోగా డెబ్యూ చేయడానికి ముందే ఇమేజ్ ఈ స్థాయిలో డ్యామేజ్ కావడం మాత్రం షారుఖ్ ఖాన్ ఊహించని పరిణామం. మరి కొడుకుని ఈ గండం నుంచి ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి

Also Read : Uppena : పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన ప్రేమకథ ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp