మొదటి కర్చీఫ్ రాఖీ భాయ్ దే ?

By iDream Post Jun. 23, 2021, 03:57 pm IST
మొదటి కర్చీఫ్ రాఖీ భాయ్ దే ?

ఈ ఏడాది రావాల్సిన పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు మోసుకుంటున్న కెజిఎఫ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతమయ్యాయి. వచ్చే నెల ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీజర్ కు పది రెట్లు అధికంగా గూస్ బంప్స్ ఇచ్చే కంటెంట్ ని అందులో చూపించబోతున్నట్టు ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ ఉంది. గతంలో ప్రకటించిన జులై విడుదల సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు టీమ్ నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద తీవ్ర చర్చల్లో ఉంది. అందరూ చెప్పాక మనం అనౌన్స్ చేస్తే బిజినెస్ పరంగా ఇబ్బంది కావొచ్చనే ఉద్దేశంతో ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు వినికిడి.

దాని ప్రకారం కెజిఎఫ్ 2 సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. కరోనా థర్డ్ వేవ్ రాకుండా థియేటర్లు వంద శాతం కెపాసిటీతో నడుస్తుంటే మాత్రమే దీన్ని థియేటర్లలోకి వదులుతారు. ముఖ్యంగా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నార్త్ లోనూ అంతా సద్దుమణగాలి. లేదూ అంటే మరోసారి వాయిదా తప్పదు. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలు రిలీజ్ కోసం ప్లానింగ్ లో ఉన్నాయి కాబట్టి సేఫ్ గేమ్ ఆడటం కోసం కెజిఎఫ్ 2 సెప్టెంబర్ ని లాక్ చేసుకునే స్ట్రాటజీలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ముందైతే ఓ మాట అనుకున్నారట

కెజిఎఫ్ 2 మీద మాములు హైప్ లేదు. బిజినెస్ పరంగానూ విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఒకవేళ ఫస్ట్ చాప్టర్ ని మించి ఉంటే మాత్రం చాలా సెంటర్స్ లో బాహుబలిని టచ్ చేసినా లేదా దాటినా ఆశ్చర్యం లేదు. ప్రశాంత్ నీల్ మాత్రం ఎప్పటికప్పుడు ఆ భరోసాను ఇస్తూనే ఉన్నాడు. హిందీతో మొదలుకుని తెలుగు దాకా ప్రతి భాషలోనూ డబ్బింగ్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ నెలకొనడంతో నిర్మాతలకు ప్రీ రిలీజ్ లోనే భారీ లాభాలు అందాయి. ఓటిటి కూడా అమెజాన్ ప్రైమ్ తో డీల్ ఓకే అయ్యిందట. ఎంత మొత్తానికి అనే వివరాలు మాత్రం బయటికి రాలేదు. అంతా బాగుంటే రాఖీ భాయ్ సెప్టెంబర్ రెండో వారంలో వస్తాడన్న మాట

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp