Pushpa : బన్నీ పాన్ ఇండియా ప్లాన్లకు కొత్త చిక్కు

By iDream Post Nov. 17, 2021, 10:24 am IST
Pushpa : బన్నీ పాన్ ఇండియా ప్లాన్లకు కొత్త చిక్కు

అదేంటి మన సినిమాకు హాలీవుడ్ మూవీకి లింక్ ఏంటి అనుకుంటున్నారా. విషయం చాలా ఉంది. వచ్చే నెల డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది తనకు మొదటి పాన్ ఇండియా రిలీజ్. హిందీలోనూ నేరుగా థియేటర్లలోకి తెస్తున్నారు. దానికి సంబంధించిన చిక్కులను ఇటీవలే క్లియర్ చేసుకున్నారు కూడా. అదే రోజు స్పైడర్ మ్యాన్ కొత్త వెర్షన్ నో వే హోమ్ కూడా ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లలో భారీ ఎత్తున దాడి చేయబోతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు వదిలిన ట్రైలర్ చూశాక మర్వెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కు దీని మీద ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి.

నార్త్ మార్కెట్ ని ఈసారి గట్టిగా టార్గెట్ చేసుకున్న బన్నీకి స్క్రీన్ కౌంట్ విషయంలో స్పైడర్ మ్యాన్ గట్టి థ్రెట్ గా మారబోతున్నాడు. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో నటించిన విలన్లందరినీ ఒకే దాంట్లో పొందుపరచడం, డాక్టర్ స్ట్రేంజ్ కి ప్రాధాన్యత కలిగించడం. స్పైడర్ మ్యాన్ ట్రిపుల్ రోల్ చేశాడనే లీకులు వదలడం ఒక్కసారిగా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇప్పుడీ ట్రైలర్ చూశాక వామ్మో అనకుండా ఉండలేరు. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన మల్టీ ప్లెక్సులు, ఏ సెంటర్లలో థియేటర్లు స్పైడర్ మ్యాన్ కు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. పుష్పకు డిస్ట్రిబ్యూటర్ల అండదండలు ఉన్నా కూడా ప్రేక్షకుల ఛాయస్ ఏది అవుతుందన్నదే ఇక్కడ కీలకం.

తెలుగు రాష్ట్రాల వరకు మరీ అంత ఇబ్బంది ఉండే ఛాన్స్ లేదు కానీ కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి చోట్ల వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ చిక్కు కేవలం ఏ సెంటర్లకే పరిమితం. మాస్ ఆడియన్స్ ఓటు ముందు మన పుష్పకే వెళ్తుంది. అందులో సందేహం లేదు. ఇప్పటికే మూడు పాటలు వచ్చేసాయి. నాలుగోది ఇవాళ వదులుతారు. ఇక సమంతా మీద తీయబోయే ఐటెం సాంగ్ బ్యాలన్స్ ఉండొచ్చు. ఇంకా నెల రోజుల కంటే తక్కువ టైం ఉన్న నేపథ్యంలో సుకుమార్, బన్నీ పరుగులు పెడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా దుబాయ్ లాంటి ఇంటర్నేషనల్ వెన్యూ మీద చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మైత్రి మేకర్స్.

Also Read : Sumanth : అక్కినేని హీరోకి మళ్ళీ బ్రేక్ ఎప్పుడో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp