బాలయ్య ఎప్పుడు వస్తున్నట్టు

By iDream Post Aug. 22, 2021, 01:30 pm IST
బాలయ్య ఎప్పుడు వస్తున్నట్టు

నందమూరి బాలకృష్ణ బోయపాటి శీనుల హ్యాట్రిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా ఇంకో రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. వచ్చే నెల రెండో వారంలోగా అవి కూడా పూర్తి చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. విడుదల తేదీ విషయంలోనే ఇంకా ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇప్పుడు అఖండకు కీలకంగా మూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి ఆర్ఆర్ఆర్ వదిలేసుకున్న అక్టోబర్ 13. ఆ రోజు ఆచార్య వస్తుందా రాదా అనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సో గ్యారెంటీగా చెప్పలేం.

ఒకవేళ ఆ డేట్ ని చిరంజీవి కనక వదిలేసుకుంటే అప్పుడు బాలయ్యకు సోలోగా బరిలో దిగే అవకాశాలు ఉంటాయి. లేదూ అక్టోబర్ 2 కూడా ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. ఆ టైంలో సాయి తేజ్ రిపబ్లిక్ ఆపై వారం వైష్ణవ్ తేజ్ కొండపోలం తప్ప పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు. కానీ ఆ రెండూ ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్నవి. మరి అఖండ వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఆ టైంకంతా పూర్తి చేయడం అసాధ్యం కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత వేగంగా చేయగలరా లేదా అనేది చూడాలి. అఖండ ఫస్ట్ ఆడియో సింగల్ అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సంగతి ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఆలస్యం జరిగి అక్టోబర్ మిస్ అయితే మాత్రం అఖండ డిసెంబర్ కు లాక్ కావడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే బాలయ్య సెంటిమెంట్ అయిన సంక్రాంతికి మామూలు పోటీ లేదు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్ ఆల్రెడీ లాక్ చేసుకుని కూర్చున్నాయి. అఖండ ఎంత మాస్ మూవీ అయినా వాటితో పోటీ పడటం అంత ఈజీ కాదు. అందుకే ముందే రావడం సేఫ్. అసలే ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్స్, రూలర్ దారుణమైన ఫలితంతో దెబ్బ తిన్న బాలయ్యకు ఈ అఖండ సక్సెస్ చాలా కీలకం. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ కాగా శ్రీకాంత్ విలన్ గా నటించడం ఇప్పటికే అంచనాలు పెంచింది

Also Read: క్రేజీ రియాలిటీ షో సభ్యులు లీక్ అయ్యారా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp