శ్యామ్ సింగ రాయ్ డీల్ అయ్యిందా ?

By iDream Post Sep. 23, 2021, 04:30 pm IST
శ్యామ్ సింగ రాయ్ డీల్ అయ్యిందా ?

వరసగా రెండు పెద్ద సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రావడం, అవి డిజాస్టర్ కావడం న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. టక్ జగదీష్ రిలీజ్ కు ముందు డిస్ట్రిబ్యూటర్లు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయి నానిని దుమ్మెత్తిపోయడం ఇండస్ట్రీలోనూ కలకలం రేపింది. డిజిటల్ రిలీజ్ కాబట్టి మూవీ ఎలా ఉన్నా ప్రైమ్ లో భారీ వ్యూస్ దక్కించుకుని తెలుగు నెంబర్ వన్ వ్యూయర్ గా నిలవడం విశేషం. కానీ ఇకపై నేరుగా చిన్నతెరపై విడుదలయ్యేందుకు ఒప్పుకోనని ఇదే లాస్టని నాని ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా శ్యామ్ సింగ రాయ్ ఎంత ఆలస్యమైనా సిల్వర్ స్క్రీన్ కే రాబోతోంది.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. కాకపోతే థియేట్రికల్ రన్ అయ్యాకే. ఎంత గ్యాప్ అనేది ఇంకా బయటికి చెప్పలేదు. నిజానికి శ్యామ్ సింగ రాయ్ కు సైతం డైరెక్ట్ ఓటిటికి భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఇది పెద్దతెరపై చూడాల్సిన కంటెంట్ కాబట్టి నిర్మాతలు వాటిని తిరస్కరించారు. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ కం సోషల్ డ్రామాలో నాని డ్యూయల్ రోల్ చేసినట్టు టాక్ ఉంది. సాయి పల్లవి కృతి శెట్టి హీరోయిన్లుగా నటించడం ఇప్పటికే అంచనాలు పెంచేసింది. కాకపోతే సిజె వర్క్ ఎక్కువ అవసరం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమయ్యేలా ఉంది.

ప్రస్తుతం నాని అంటే సుందరానికి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది కూడా ఇంకో రెండు నెలల్లో పూర్తయిపోతుంది. ఒకవేళ పరిస్థితులు ఇప్పటిలాగే ఉంటే ముందు ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేసి ఆపై శ్యామ్ సింగ రాయ్ ని వదులుతారు. కానీ ఏదీ ఖరారుగా చెప్పలేరు కాబట్టి ఇప్పుడే ఒక కంక్లూజన్ కి రాలేం. ఇటీవలి కాలంలో నానికి సరైన బ్లాక్ బస్టర్ దొరికి చాలా గ్యాప్ వచ్చేసింది. ఎంసిఏ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు ఇచ్చిన సినిమా రాలేదు. జెర్సీ మాత్రమే పేరొచ్చింది కానీ మిగిలినవన్నీ లాస్ వెంచర్లే. అందుకే శ్యామ్ సింగ రాయ్ తో పాటు అంటే సుందరానికి మీద ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి

Also Read : అక్టోబర్ 10 పోరుకి 'మా' బృందాలు రెడీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp