సుందరంలో నాని షాకింగ్ రోల్ ?

By iDream Post Nov. 21, 2020, 07:03 pm IST
సుందరంలో నాని షాకింగ్ రోల్ ?

ఇవాళ నాని 28ని మైత్రి నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అంటే సుందరానికి అనే వెరైటీ టైటిల్ పెట్టి ఆదిలోనే ప్రేక్షకులను అభిమానులను ఆసక్తికి గురి చేశారు. సెన్సిబుల్ లవ్ స్టోరీ మెంటల్ మదిలో, కిడ్నాప్ డ్రామా బ్రోచేవారెవరురా లాంటి బడ్జెట్ సినిమాలతోనే అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్న వివేక్ ఆత్రేయ దీనికి దర్శకుడు కావడంతో అంచనాలు మొదలయ్యాయి. నిజానికిది ఎప్పుడో లాక్ డౌన్ కు ముందు సెట్ అయిన కాంబినేషన్. టైంకి వి, టక్ జగదీశ్ లు విడుదలై ఉంటే ఈ అంటే సుందరానికి షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉండేది. కానీ కరోనా వల్ల నాని షెడ్యూల్స్ అన్నీ మారిపోయి ఇలా ఆలస్యంగా మొదలుపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ అంటే సుందరానికిలో హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అమ్మాయిల పొడ అంటే గిట్టని వాడిగా, సెక్సువల్ ఫీలింగ్స్ లేని వట్టి అమాయక ముద్దపప్పులా సాగుతుందని తెలిసింది. ఇతన్ని ఇష్టపడి వెంటపడి ప్రేమించే అమ్మాయిగా హీరోయిన్ నజ్రియా పాత్ర ఉంటుందని సమాచారం. వినడానికి ఆసక్తికరంగానే ఉంది. ఈ లవ్ ట్రాక్ తో పాటు ఫన్నీ విలన్ ఎపిసోడ్ కూడా హై లైట్ గా ఉండబోతోందని వినికిడి. ఇప్పటికైతే ఇంతే డీటెయిల్స్ బయటికి వచ్చాయి. అధికారికంగా చెప్పలేదు కాబట్టి ఇదే ఖచ్చితమని చెప్పలేం కానీ టాక్ అయితే ఉంది.

నాని ప్రస్తుతం టక్ జగదీశ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే మార్చి లేదా ఏప్రిల్ లో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో రాహుల్ సంకృత్యాన్ తీయబోయే శ్యామ్ సింగ రాయ్ కోసం రెడీ అవుతాడు నాని. ఆపైనే అంటే సుందరానికి సెట్స్ లో అడుగు పెడతాడు. ఇవన్నీ 2021లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి మిస్ అయినా రెండు గ్యారెంటీగా రిలీజ్ చేస్తారు. ఇవి కాకుండా 29, 30 సినిమాలకు సంబంధించిన చర్చలు కూడా నాని చేస్తున్నాడు. వృథా అయిన 2020ని గట్టిగానే కాంపెన్సేట్ చేసుకునేలా కనిపిస్తోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp