నందమూరి మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం ?

By iDream Post May. 04, 2021, 03:00 pm IST
నందమూరి మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం ?

టాలీవుడ్ లో పేరుకు స్టార్ కుటుంబాల్లో ఎందరో హీరోలు ఉన్నారు కానీ ఏ ఇద్దరూ కలిసి నటించిన దాఖలాలు తక్కువ. స్వంత తండ్రి కొడుకులు లేదా అన్నదమ్ములు కాంబో కావాలన్నా అభిమానుల ఈగోలను దృష్టిలో పెట్టుకోవాల్సిందే. చిరంజీవి రామ్ చరణ్ కలిసి ఫుల్ లెన్త్ రోల్స్ ఉన్న మూవీ చేయడానికి దశాబ్దం పైగానే పట్టింది. నాగార్జున ఫ్యామిలీ మొత్తం మనంలో కనిపించడం ఒక్కటే ఊరటగా చెప్పుకోవాలి. ఇక నందమూరి సంగతి సరేసరి. బాలయ్య ఇప్పటిదాకా ఇతర హీరోలతో పెద్దగా కలిసింది లేదు. కృష్ణ, కృష్ణంరాజుతో సుల్తాన్ చేశారు కానీ దాని ఫలితం దెబ్బకు వాటి జోలికి వెళ్ళలేదు. అప్పటికి ఆ ఇద్దరూ బాగా సీనియర్లు.

ఇదిలా ఉండగా బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎప్పుడో 1990లో బాల గోపాలుడులో బాబాయ్ తో కలిసి నటించాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. కళ్యాణ్ రామ్ హీరో అయ్యాక మళ్ళీ తెరమీద కలిసి కనిపించింది లేదు. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ సాధ్యమవుతుందేమో చూడాలి. అయితే కళ్యాణ్ రామ్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ అయ్యుంటే ఆ కిక్ ఇంకో లెవల్ లో ఉండేది. కళ్యాణ్ రామ్ ఎంత మంచి నటుడైనా స్టార్ అనిపించుకునే స్థాయికి చేరుకోలేకపోయారు. అందుకే క్రేజ్ విషయంలో తమ్ముడి కంటే వెనుకబడ్డాడు.

ఇందులో నిజా నిజాలు ఎంతున్నాయనేది పక్కనపెడితే కార్యరూపం దాల్చాలనే కోరుకోవాలి. ఆర్ఆర్ఆర్ తప్ప ప్రస్తుతం సెట్స్ మీద టాలీవుడ్ మల్టీ స్టారర్స్ ఇంకేవి లేవు. అడపాదడపా వెంకటేష్ చేయడం తప్ప మిగిలిన స్టార్లు ఈ విషయంగా పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. అఖండ బాలన్స్ పూర్తి చేయడం కోసం బాలయ్య ఎదురు చూస్తుండగా కళ్యాణ్ రామ్ సైతం ఓ డిఫరెంట్ ప్రాజెక్ట్ లో మేకోవర్ చేసుకుని మరీ నటిస్తున్నాడు. మరోవైపు అనిల్ రావిపూడి ఎఫ్3 మిగిలిపోయిన పార్ట్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ న్యూస్ తాలూకు కన్ఫర్మేషన్ రావాలంటే ఇంకా టైం పడుతుంది మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp