యూత్ హీరోల కంటే స్పీడ్

By iDream Post Jul. 21, 2021, 06:01 pm IST
యూత్ హీరోల కంటే స్పీడ్

నందమూరి బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే తగ్గేదేలే రేంజ్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం అఖండని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టిన బాలయ్య ఆ తర్వాత కూడా రెండు మూడేళ్లు నాన్ స్టాప్ బిజీ ఉండేలా డైరీని నింపేస్తున్నారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని సినిమా తాలూకు పనులు ఇప్పటికే మొదలు కాగా ఫామ్ తో పాటు భీభత్సమైన డిమాండ్ ఉన్న అనిల్ రావిపూడిని కూడా లాక్ చేసుకోవడం ఇప్పటికే అభిమానులను మంచి కిక్ ఇచ్చింది. ప్రస్తుతం ఎఫ్3 షూట్ లో ఉన్న అనిల్ అది కాగానే కొత్త స్క్రిప్ట్ పనులు మొదలుపెడతారు. యాక్షన్ ని ఎంటర్ టైన్మెంట్ ని పర్ఫెక్ట్ మిక్స్ చేయడంలో పేరున్న ఇతను బాలయ్యని ఏ రేంజ్ లో చూపిస్తారో

ఇక నిన్న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ త్వరలో హారికా హాసిని బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే అది త్రివిక్రమ్ భాగస్వామ్యంలో నడిచే సంస్థ. ఆయన డైరెక్షన్ లో ఇప్పుడైతే ఛాన్స్ లేదు. అంత బిజీ కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి దానికి సిస్టర్ కన్సర్న్ గా ఉన్న సితార కోసం చేస్తారేమో చూడాలి. పవన్ తో తీస్తున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ ఇలాగే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ బాలయ్య ప్రాజెక్ట్ కోసం ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అందులో ఒక తమిళ మాస్ డైరెక్టర్ కూడా ఉన్నారని వినికిడి. ఫైనల్ అయ్యాక వివరాలు తెలుస్తాయి

ఇవి కాకుండా పైసా వసూల్ కాంబోని మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నారు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఒక ప్రతిపాదన ఉందని ఆయనే అంటున్నారు. గతంలో పూరి కూడా ఈ ప్రస్తావన తేవడం గుర్తే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో తీయబోయే భారీ సోషియో ఫాంటసీ ద్వారా మోక్షజ్ఞని లాంచ్ చేస్తానని ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన చూస్తే అఖండతో కలిపి మొత్తం కౌంట్ ఆరుకు చేరుతుంది. ఇంత స్పీడ్ గా ఇప్పటి జనరేషన్ హీరోలు కూడా లేరన్న మాట వాస్తవం. చిరు ఒకవైపు మూడు సినిమాల ప్లానింగ్ లో ఉండగా బాలయ్య ఏకంగా డబుల్ కౌంట్ చూపిస్తున్నారు

Also Read: కథల కరువు ఈ రేంజ్ లో ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp