3 సినిమాలతో నాగార్జున స్కెచ్

By iDream Post Jun. 14, 2020, 05:03 pm IST
3 సినిమాలతో నాగార్జున స్కెచ్

కింగ్ నాగార్జునకు గత నాలుగేళ్లుగా టైం అంతగా కలిసి రావడం లేదు. 2016లో ఊపిరి సక్సెస్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఏదీ పడలేదు. లాస్ట్ మూవీ మన్మధుడు 2 ఫ్లాప్ మాట అటుంచి విమర్శలు కూడా అందుకోవాల్సి వచ్చింది . అందుకే ఈసారి స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా డిఫరెంట్ రోల్ చేస్తున్న ఈ మూవీపై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల షూటింగ్ బ్రేక్ పడింది. కొంత భాగం విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉన్నందు వల్ల బాలన్స్ ఇక్కడే పూర్తి చేస్తారా లేక కొన్ని రోజులు బ్రేక్ వేస్తారా ఇంకా తెలియాల్సి ఉంది.

ఈలోగా మరో ప్రాజెక్ట్ కు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నాగ చైతన్యతో ప్రస్తుతం లవ్ స్టొరీ నిర్మిస్తున్న సునీల్ నారంగ్ బ్యానర్ లో ఓకే చెప్పారని వినికిడి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ కు గరుడవేగ రూపంలో మంచి హిట్ అందించిన ప్రవీణ్ సత్తారు ఆ తర్వాత కొన్ని కాంబినేషన్లు ట్రై చేసినప్పటికీ వర్క్ అవుట్ కాలేదు. రామ్ హీరోగా ఓ చిత్రం పూజా కార్యక్రమాలు చేశాక ఆగిపోయింది. ప్రముఖ బ్యాడ్ మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపి చంద్ బయోపిక్ తీస్తారని టాక్ వచ్చింది కాని ఏవో కారణాల వల్ల అదీ ఆశించినంత వేగంగా ముందుకు సాగలేదు. దానికన్నా ముందు నాగార్జునతో ఓ కమర్షియల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్టుగా వినికిడి.

కథ నచ్చిందని కాకపోతే ఫుల్ వెర్షన్ ఫైనల్ చేశాక అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారట. మరి సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ గురించి మాత్రం ఇంకా ఏ విషయమూ తెలియడం లేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నప్పటికీ ఎందుకనో అది సెట్స్ పైకి వెళ్ళడంలో ఆలస్యం జరుగుతోంది. పైగా నాగ చైతన్య కాంబినేషన్ ఉండటంతో కాల్ షీట్స్ సమస్య ఏదైనా ఉందేమో తెలియదు. అయితే జరగడం మాత్రం ఖాయం. మొత్తానికి నాగార్జున కొంత గ్యాప్ ఇచ్చినా ఒకేసారి మూడు సినిమాలను ప్లాన్ చేసుకున్నారన్న మాట. లాక్ డౌన్ పూర్తిగా ముగిశాకే దీనికి సంబంధించిన స్పష్టత రానుంది. అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా ఏది అంతుచిక్కని పరిస్థితి ప్రస్తుతం పరిశ్రమలో నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp