Naga Chaitanya : చైతు పాకెట్ లో మరో ఎంటర్ టైనర్

By iDream Post Oct. 21, 2021, 06:30 pm IST
Naga Chaitanya : చైతు పాకెట్ లో మరో ఎంటర్ టైనర్

ఒక కాంబినేషన్ లో సినిమా అనుకున్నప్పుడు రకరకాల కారణాల వల్ల అది చేతులు మారడం సహజం. గతంలో చాలాసార్లు అలా జరిగింది. త్రివిక్రమ్ అతడు కథ చెప్పినప్పుడు పవన్ కు నిద్రరాకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ కు మరో బ్లాక్ బస్టర్ దక్కేది. ఇడియట్, పోకిరి, ఆంధ్రావాలా, మొన్న వచ్చిన మహాసముద్రం ఇలా వీటికి ముందు అనుకున్న హీరోలు వేరే. తాజాగా అలాంటిదే మరొకటి జరిగిందని ఫిలిం నగర్ టాక్. విజయ్ దేవరకొండ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ లో ఇప్పుడు రౌడీ బాయ్ కు బదులు లవర్ బాయ్ నాగ చైతన్య వచ్చి చేరినట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు.

నందిని రెడ్డి ప్రస్తుతం ఏక్ మినీ కథ ఫేమ్ సంతోష్ శోభన్ తో మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదవ్వగానే చైతుతో సినిమా పట్టాలు ఎక్కుతుంది. లవ్ స్టోరీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నాగ చైతన్య థాంక్ యుతో పాటు బంగార్రాజు షూటింగులలో పారలల్ గా పాల్గొంటున్నాడు. ముందు ఏది విడుదల అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే చేస్తున్న వెబ్ సిరీస్ కూడా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందని సమాచారం. ఇవన్నీ మహా అయితే వచ్చే జనవరిలోగానే పూర్తవుతాయి కాబట్టి చైతుకి డేట్స్ పరంగా పెద్ద ఇబ్బందేమీ లేదు. అఫీషియల్ గా చెప్పేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

ఇదంతా ఓకే కానీ విజయ దేవరకొండ డ్రాప్ అవ్వడానికి కారణాలు ఏంటా అని ఆరా తీస్తే కాల్ షీట్స్ సమస్యని తెలిసింది. లైగర్ కు బాగా జాప్యం జరగడం ఈ హీరో డైరీని బాగా డిస్ట్రబ్ చేసింది. ఇంకా యుఎస్ లో మైక్ టైసన్ తో కలిసి చేయాల్సిన అసలైన షెడ్యూల్ పెండింగ్ లో ఉంది. ఇది పూర్తి చేశాక దర్శకుడు సుకుమార్ తో ఫిక్స్ చేసుకున్న పాన్ ఇండియా మూవీ తాలూకు పనులు మొదలు పెట్టుకోవాలి. ఇంత టైట్ గా ఉండటం వల్లే తప్పనిసరి పరిస్థితిలో నందినిరెడ్డికి నో చెప్పాల్సి వచ్చిందట. మంచి ఎంటర్ టైనర్స్ తో దూసుకుపోతున్న చైతుతో నందినిరెడ్డి నుంచి అలా మొదలయ్యింది తరహాలో మంచి వినోదాన్ని ఆశించవచ్చు

Also Read : Aryan Khan : ఖాన్ వారసుడి డ్రగ్ కేసులో కొత్త మలుపు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp